అమరావతి ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలపై ఇచ్చిన జీవో మీద చర్చించారు. అమరావతిని దెబ్బతీసేందుకే పొరుగు జిల్లాల వారికి స్థలాలు ఇస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. సిద్ధంగా ఉన్న పేదల గృహాలను లబ్ధిదారులకు ఇవ్వట్లేదని నేతలు తెదేపా అధినేతకు తెలిపారు. రాజధాని కదిలించలేని స్థితి ఉన్నందునే ఈ అంశం తెరపైకి తెచ్చారని నేతలు అన్నారు.
ప్రభుత్వ చర్య సీఆర్‌డీఏ చట్ట ఉల్లంఘనేనని నేతలు పేర్కొన్నారు. రాజధాని భూములు ఇతరులకు ఇస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని నేతలు అన్నారు. ఈ భేటీలో లోకేశ్, యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి, ఆనందబాబు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
ఇదీ చదవండి : వివాహ వేడుక... అమరావతి నినాదానికి వేదిక