ETV Bharat / city

నామినేషన్ల గడువు పెంచండి.. ఈసీకి చంద్రబాబు లేఖ - chandra babu letter to ec on local body elections

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. సకాలంలో నోడ్యూస్‌, కుల ధ్రువీకరణ పత్రాలు అందచేయలేదని ఆరోపించారు. వైకాాపా శ్రేణులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని లేఖలో పేర్కొన్నారు.

chandra babu letter to ec
ఈసీకి చంద్రబాబు లేఖ
author img

By

Published : Mar 12, 2020, 10:29 AM IST

ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని తెదేపా అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. సిబ్బంది సకాలంలో నో డ్యూస్‌, కుల ధ్రువీకరణ పత్రాలు అందచేయలేదని ఆరోపించారు. అధికారులు అందుబాటులోలేని కారణంగా అందజేయలేకపోయామనే కారణాలు చెప్పారన్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ నామినేషన్లు దాఖలును అడ్డుకోగా.. ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలకు అనేకమంది సకాలంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 76చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఘటనలు చోటుచేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆయా ఆధారాలను తన ఫిర్యాదు లేఖకు జత చేశారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం సహా... భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకొనేలా పోలీసులను ఆదేశించాలన్నారు. పులివెందుల, మాచర్ల, పుంగనూరు, మంత్రాలయం, తెల్లకూరు, కావేటినగర్‌, పుల్లంపేట స్థానాల్లో మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి :పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.