ఒకరిని దృష్టిలో పెట్టుకుని రీటెండరింగ్ ప్రక్రియ చేపట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలవరం విషయంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం లేదని రీ టెండరింగ్ చేపట్టిందని మండిపడ్డారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో పోలవరం ఆపేశారని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్‌కు పోలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం పెరుగుతుందని... ప్రాజెక్టు భద్రత, నాణ్యత ప్రమాణాలతో ఆడుకుంటున్నారని చంద్రబు విచారం వ్యక్తం చేశారు. కేంద్రం, నిపుణులు చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా ముందుకెళ్తోందన్నారు.
ఇదీ చదవండి