ETV Bharat / city

Funds To AP Under Jal Jeevan Mission: జల్‌ జీవన్‌ మిషన్‌లో ఏపీ రూ.3 వేల కోట్లు కోల్పోయే ప్రమాదం: కేంద్రం - Jal Jeevan Mission in AP

Funds To AP Under Jal Jeevan Mission: జల జీవన మిషన్​పై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్రం తెలిపింది. 2019-20, 2020-21 సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 453.66 కోట్ల రూపాయలను ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి లోపు చెల్లించకపోతే పథకం కింద వచ్చే దాదాపు 3 వేల కోట్ల రూపాయలు మురిగిపోతాయని స్పష్టం చేశారు.

Jal Jeevan Mission
Jal Jeevan Mission
author img

By

Published : Dec 6, 2021, 8:52 PM IST

Funds To AP Under Jal Jeevan Mission: జల జీవన మిషన్ అమలు విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా.. 4 వేల కోట్లు కోల్పోయే ప్రమాదం ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఇంటింటికి కుళాయి నీరు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తి నిధులతో అమలు చేస్తున్న జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకు అవసరమైన రాష్ట్ర వాటాను ఏపీ ప్రభుత్వం గత రెండేళ్లుగా సమకూర్చలేదని రాజ్యసభకు కేంద్ర మంత్రి తెలిపారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకం కింద కేంద్రం కేటాయించిన నిధుల నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని పేర్కొన్నారు.

Funds To AP Under Jal Jeevan Mission: 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం.. రాష్ట్రానికి రూ. 372.64 కోట్లు కేటాయించి విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 121.62 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 790.48 కోట్లు కేటాయించగా.. వాటిలో కేవలం రూ. 297.62 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా రూ. 3180 2.88 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేకపోయిందని వివరించారు. 2019-20, 2020-21 సంవత్సరానికి గాను కేంద్రం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 453.66 కోట్ల రూపాయలను ఇంతవరకు ఇవ్వలేదని వివరించారు. 2022 మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధుల విడుదలలో జాప్యం చేస్తే... నిబంధనల ప్రకారం రాష్ట్రానికి జల జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం కేటాయించిన 3,183 కోట్ల రూపాయలు మురిగిపోతాయని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.

MP GVL On Jal Jeevan Mission funds: ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం - ఎంపీ జీవీఎల్

ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రంగాల్లోనూ వేల కోట్ల నిధులను అనేక పథకాల ద్వారా కేంద్రం చేస్తున్న సహాయాన్ని కూడా అంగీకరించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎంపీ జీవీఎల్ అన్నారు. చేతగానితనానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని జీవీఎల్ దుయ్యబట్టారు.

ఏపీనే నిర్ణయం తీసుకోవాలి

Centre On petro complex at Kakinada: ఏపీ చొరవతోనే కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ నిర్మాణం అవుతుందని కేంద్రం చెప్పింది.వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ సర్దుబాటుకు ఏపీ ముందుకొస్తేనే సాధ్యమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి హరదీప్‌సింగ్‌ పూరి సమాధానం ఇచ్చారు. 32,901 కోట్లతో ఏర్పాటుకు 2017లో గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌తో ఏపీ ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. అనంతరం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగిందన్నారు. వీజీఎఫ్‌ భరించాలని రాష్ట్రాన్ని చమురు సంస్థలు కోరాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం భారీ మూలధన వ్యయం, పెట్టుబడులు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపుతుందన్నారు. పన్నుల రాబడి పెరుగుదల, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏపీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.

  • జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3, 200 కోట్ల నిధులను డ్రా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై రాజ్యసభలో నా ప్రశ్నకు సమాధానం.వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నా స్పందన. సీఎం @ysjagan గారు,ప్రజల కనీస అవసరాలపై ఎందుకు ఈ నిరాసక్తత? @BJP4Andhra pic.twitter.com/9MxtXIgwVQ

    — GVL Narasimha Rao (@GVLNRAO) December 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

CM Jagan On Paddy Crop: అక్కడ వరికి బదులు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.