ETV Bharat / city

ఏపీకి 5 మెగా టెక్స్‌టైల్‌ పార్కులు: కేంద్ర జౌళిశాఖ వెల్లడి - Five Mega Textile Parks in AP

Mega Textile Parks in AP: మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు కోసం.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమకు ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక అందినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి తెలిపారు. భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ స్కీం కింద ఏపీకి 5 పార్కులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Mega Textile Parks in AP
Mega Textile Parks in AP
author img

By

Published : Feb 12, 2022, 1:32 PM IST

Mega Textile Parks in AP: మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు కోసం.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమకు ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక అందినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోస్‌ రాజ్యసభకు తెలిపారు. భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ స్కీం కింద ఏపీకి 5 పార్కులు మంజూరు చేసినట్లు తెలిపారు. మొత్తం రూ. 699.95 కోట్లు ఖర్చు అయ్యే ప్రాజక్టుల కోసం... ఇప్పటివరకు రూ. 127.89 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

ఇందులో బ్రాండిక్స్‌ సిటీ పూర్తయిందని... మిగిలిన 4 పార్కుల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ఇప్పుడు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ కింద 2027-28 నాటికి రూ. 4,445 కోట్లతో ఏడు పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఛాలెంజ్‌ విధానంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఆసక్తి ఉన్న రాష్ట్రాలు మార్చి 15వ తేదీలోపు దరఖాస్తులు పంపాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశామన్నారు. ఇప్పటి వరకు ఏపీ నుంచి ప్రాథమిక ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు: నారా లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.