ETV Bharat / city

'బడ్జెట్‌ నుంచి చెల్లిస్తే అవి రాష్ట్ర రుణాలే' - ఏపీ తాజా వార్తలు

ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీలను రాష్ట్ర బడ్జెట్‌ ద్వారా గానీ, రాష్ట్రానికి వచ్చే పన్నులు, సుంకాల వంటి ఆదాయం ద్వారా గానీ చెల్లిస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

బడ్జెట్‌
బడ్జెట్‌
author img

By

Published : Jul 20, 2022, 5:23 AM IST

ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీలను రాష్ట్ర బడ్జెట్‌ ద్వారా గానీ, రాష్ట్రానికి వచ్చే పన్నులు, సుంకాల వంటి ఆదాయం ద్వారా గానీ చెల్లిస్తే వాటిని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 (3) కింద రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టం 2005 ప్రకారం రెవెన్యూ లోటును పూర్తిగా పరిహరించి, లోటును తగ్గించుకుంటూ తగిన నిర్వహణతో ఆర్థిక సుస్థిరత సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆర్థిక స్థిరత్వం, ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకత సాధించడం అందులో భాగమే.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) కింద రాష్ట్ర ప్రభుత్వాలు చేసే రుణాలకు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం సాధారణంగా అనుమతులు ఇస్తుంటుంది. ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన కొలమానాలను దృష్టిలో ఉంచుకొని ఈ అనుమతులను మంజూరు చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌, అలాంటి ఇతరత్రా వ్యవస్థల ద్వారా రుణాలు తీసుకుని దానికి సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్‌ల నుంచి చెల్లిస్తున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన బహిరంగ రుణ పరిమితులను ఉల్లంఘిస్తూ రాష్ట్రాలు ఇలా అప్పులు తెస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇలాంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలుగా పరిగణించాలని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు గత మార్చిలో రాష్ట్రాలకు వర్తమానం పంపింది...’ అని పంకజ్‌ చౌదరి వివరించారు.

రూ.1,62,828 కోట్ల అధిక వ్యయం: రాష్ట్ర విభజన తర్వాత 2014-15 నుంచి 2018-19 మధ్యకాలంలో రూ.1,62,828 కోట్ల అధిక వ్యయం జరిగిందని, ఆ మొత్తాన్ని ఇంకా క్రమబద్ధీకరించాల్సి ఉందని కాగ్‌ సమర్పించిన నివేదిక పేర్కొందని పంకజ్‌ చౌదరి కనకమేడల అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థికశాఖ రూ.51,677.74 కోట్లకే కాగ్‌కు వివరణ పత్రం సమర్పించి 2014-15 నుంచి 2018-19 మధ్యకాలానికి సంబంధించిన అధిక వ్యయాన్ని క్రమబద్ధీకరించాలని కోరినట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 205 ప్రకారం ఇలాంటి అధిక వ్యయానికి రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కుకు రూ.913 కోట్ల లాభం: విశాఖపట్నం స్టీల్‌ పరిశ్రమకు 2021-22లో రూ.913.19 కోట్ల నికర లాభం వచ్చినట్లు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగన్‌సింగ్‌ కులస్థే చెప్పారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.2021-22లో విశాఖ స్టీల్‌ 84% ఉత్పత్తి సామర్థ్యంతో 52.72 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. గత అయిదేళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు. సెయిల్‌, విశాఖ స్టీల్‌ విలీనం చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Polavaram: పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు: తెలంగాణ మంత్రి

నీట్​ 'లోదుస్తుల' రగడపై ఎన్​టీఏ కీలక వ్యాఖ్యలు.. కేంద్రానికి కేరళ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.