ETV Bharat / city

ఏపీఎస్‌డీసీ నిబంధనలు కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి: కేంద్రం

author img

By

Published : Aug 2, 2021, 10:24 AM IST

ఎంపీ రఘురామ లేఖలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ కార్పొరేషన్‌లోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని.. ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. దానికి ఎంపీ రఘురామ రాసిన లేఖలను, మీడియా కథనాలను  జతపరిచింది.

central respond to rrr letter of apssdc
ఎంపీ రఘురామ లేఖలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందన

ఎంపీ రఘురామ లేఖలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు ద్వారా రుణసమీకరణపై.. ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి , కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. కార్పొరేషన్‌లోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3)ను ఉల్లంఘించేలా ఉన్నాయని...భవిష్యత్‌ రెవెన్యూను నష్టపరిచేలా కనిపిస్తోందని రాసింది. ప్రధాని, ఆర్థికమంత్రికి ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖలను, మీడియా కథనాలను జతపరిచింది.

ప్రధానికి రఘురామ లేఖ

కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలని ...ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ రాశారు. ఇప్పటికే పలు బ్యాంకుల నుంచి ఏపీఎస్‌డీసీ సంస్థ రూ.10 వేల కోట్లు అప్పు తీసుకుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీకి రాసిన లేఖలో వివరించారు. ఉచిత పథకాల అమలుకు మరో రూ.3 వేల కోట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. లులు గ్రూపు నుంచి భూములు వెనక్కి తీసుకుని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందని లేఖలో ప్రస్తావించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు చేశారన్న రఘురామకృష్ణరాజు... సుమారు రూ.35 వేల కోట్లకుపైగా అప్పులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

గాడితప్పింది...

2020లో సగటున ప్రతి నెలా సుమారు రూ.9226 కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. ఉచిత పథకాల కోసమే సుమారు రూ.13 వేల కోట్లు అప్పు చేసిందని... రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఏపీ ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిందని వ్యాఖ్యానించారు. కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలని... ప్రజల ఆస్తులను కాపాడాలని రఘురామ కోరారు. ప్రజా సంక్షేమ పథకాల ముసుగులో వ్యక్తిగత సంక్షేమం, స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునే విధానం కనిపిస్తోందని లేఖలో ప్రస్తావించారు.

ఇదీ చూడండి.

MP RRR: ఏపీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.