ETV Bharat / city

AP Capital Issue: ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతే.. రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన - gvl narsimha rao latest news

AP CAPITAL ISSUE: అమరావతే రాష్ట్రానికి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదే అని చెప్పారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తమ దృష్టికి వచ్చిందని.. కనుక ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు.

కేంద్రమంత్రి నిత్యానందరాయ్
కేంద్రమంత్రి నిత్యానందరాయ్
author img

By

Published : Feb 2, 2022, 12:22 PM IST

Updated : Feb 3, 2022, 5:01 AM IST

AP CAPITAL ISSUE: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఇప్పుడు అమరావతే అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే దీన్ని ప్రకటించినప్పటికీ, 2020లో మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చి తర్వాత ఉపసంహరించుకొందని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం అమరావతే రాజధానిగా ఏపీ ప్రభుత్వం తెలియజేసిందని బుధవారం రాజ్యసభలో వివరించారు. భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ ‘మూడు రాజధానుల పేరిట ఏపీ ప్రభుత్వం అయోమయం సృష్టించింది. కేంద్రం కొన్నిసార్లు ఏపీకి సంబంధించిన వర్తమానాలను హైదరాబాద్‌ చిరునామాకు పంపుతోంది. ఏపీ రాజధానిపై స్పష్టత ఇవ్వాలి. రాజధాని నిర్ణయాధికారం ఎవరిదో చెప్పాలి’ అని ప్రశ్నించారు. మంత్రి నిత్యానందరాయ్‌ బదులిస్తూ ‘రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే. 2015 ఏప్రిల్‌ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని తమ రాజధానిగా ప్రకటించింది. 2020 జులైలో ఒక చట్టం ద్వారా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా పేర్కొంది. ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు మాకు మీడియా ద్వారా తెలిసింది. సమీక్ష తర్వాత మూడు రాజధానులా? ఒక రాజధానా? అన్నది తేల్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు విన్నాం. ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది’ అని స్పష్టంచేశారు.

మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనతో అయోమయం నెలకొంది. ఆ తర్వాత ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ పేరును సంబోధిస్తూ..కేంద్రం సమాచారం పంపిందని మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. కానీ అమరావతి రాజధానిగా కొనసాగుతోందని మనందరికీ తెలుసు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు ఏదీ రాజధాని నగరమో, రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉందన్న విషయంపై..అందరిలో ఉన్న గందరగోళాన్ని తొలగించాలని కేంద్ర మంత్రిని కోరుతున్నా. -జీవీఎల్ నరసింహారావు, భాజపా ఎంపీ

రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రానిదే. 2015 మార్చి 23న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. జులై 2020లో ఏపీ ప్రభుత్వం... మూడు రాజధానులు చేస్తూ చట్టం చేసింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని వెనక్కు తీసుకున్నట్లుగా ప్రసార మాధ్యమాల ద్వారా మాకు తెలిసింది. మూడు రాజధానులా లేక ఒకటే రాజధాని అన్న విషయంపై సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అప్పటివరకు అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - నిత్యానందరాయ్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి

సీఎంలు చర్చించుకుంటే మంచిదే...

‘ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి మిత్రులు. విభజన సమస్యలపై వారిద్దరు మాట్లాడుకొని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయడంలేదు. కేంద్రం కార్యదర్శి స్థాయి అధికారులను పిలవడానికి బదులు సీఎంలతోనే ఎందుకు చర్చించడం లేద’ని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బదులిస్తూ ‘విభజన అంశాలను ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలని తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో హోంమంత్రి అమిత్‌ షా సూచించారు. ముఖ్యమంత్రులిద్దరూ కలిసి చర్చిస్తే మంచిదే. మేమూ అదే కోరుకుంటున్నాం. హోంశాఖ తరఫున ప్రయత్నించాం. 24 సమావేశాలు నిర్వహించామ’ని గుర్తుచేశారు. ఏపీకి తెలంగాణ విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదని, శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని వాడుకుంటోందని, దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని ఎంపీ టీజీ వెంకటేశ్‌ ప్రశ్నించారు. ‘విద్యుత్తు బకాయిల చెల్లింపు రెండు రాష్ట్రాల మధ్యా ఉంది. దీనిపై కేంద్రం అవగతం చేసుకొని ఏం చేయాలో చూస్తాం. సమన్వయం చేయగలం తప్ప, నిర్ణయం తీసుకోలేం. మా సూచనలు రాష్ట్రాలకు పంపుతాం. శ్రీశైలం నీటి విడుదల వివాదాన్ని జల్‌శక్తి శాఖ పరిశీలిస్తుంద’ని నిత్యానందరాయ్‌ వివరించారు.

ఇరు రాష్ట్రాల భిన్న వాదనలు...

విభజన సమస్యలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా ఎంపీలు సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ పలు ప్రశ్నలు వేశారు. ‘షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విలువను రూ.1,42,601 కోట్లుగా లెక్కించినప్పటికీ, కేంద్రం వాటిని విభజించలేదు. ఏపీపై తీవ్రప్రభావం చూపుతోంది. ఆస్తుల విభజన వేగవంతానికి ఏం చర్యలు తీసుకుంటున్నార’ని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నిత్యానందరాయ్‌ సమాధానమిస్తూ.. ‘విభజన చట్టం అమలులో కేంద్రం సమన్వయకర్త మాత్రమే. మేమెలాంటి నిర్ణయాలు తీసుకోలేం. ఆదేశాలివ్వలేం. ఏదైనా ఇరురాష్ట్రాల అంగీకారంతోనే జరగాలి. 9వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై షీలా బేడీ కమిటీ వేశాం. 90 సంస్థల విభజనకు కమిటీ సిఫార్సు చేయగా, 68 సంస్థలపై తెలంగాణ అంగీకరించింది. ఏపీ ఈ 68లో 33 సంస్థల విభజనకు మాత్రమే సమ్మతించింది. ఏపీ సర్కారు అన్నింటినీ ఒకేసారి పరిష్కరించాలని కోరగా, తెలంగాణ ఒక్కోదాన్ని ప్రత్యేకంగా చూడాలంటోంది. పదో షెడ్యూల్‌లోని 112 శిక్షణ కేంద్రాలను సెక్షన్‌ 75 ప్రకారం విభజించలేం. జనాభా ఆధారంగా ఆస్తులు పంచాలని ఏపీ కోరుతుంటే, అవి ఉన్న ప్రదేశాన్ని బట్టి విభజించాలని తెలంగాణ అంటోంది. అటార్నీ జనరల్‌ అభిప్రాయం ప్రకారం అసలు వీటి విభజనకే వీల్లేదు. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలతోపాటు, మిగతా వాటిపైనా మీరు అంగీకారానికి వస్తే, మేం నిర్ణయం తీసుకోగలమని హోంశాఖ పలుమార్లు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది’ అని గుర్తుచేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ఇప్పటివరకు రూ.65,730 కోట్లు విడుదల చేయగా, తెలంగాణకు రూ.2,385 కోట్లు ఇచ్చిందని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు ఏటా నిధులు ఇస్తున్నట్లు తెలిపారు.

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతే: కేంద్రమంత్రి నిత్యానందరాయ్

ఇదీ చదవండి:

Missing Girl Identified: అమ్మ ప్రేమ కోసం.. ఆ బాలిక ఏం చేసిందంటే..!

Last Updated : Feb 3, 2022, 5:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.