AP HIGH COURT: ఏపీ హైకోర్టు బదిలీకి సంబంధించి..తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదంటూ కేంద్రం తేల్చి చెప్పింది. అలానే.. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని..కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు పార్లమెంటులో వెల్లడించారు. వైకాపా ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింత మాధవి అడిగిన ప్రశ్నకు.. కిరణ్ రిజుజు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఒక హైకోర్టును ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి బదిలీ చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి కేంద్రానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని.. అయితే ఇప్పటివరకు అలాంటిదేమీ రాలేదని చెప్పారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు అనుమతించాలని సీఎం జగన్ 2020 ఫిబ్రవరిలో కోరినా.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు.
AP Highcourt shifting: ఏపి హైకోర్టు తరలింపు ప్రతిపాదన.. కేంద్రం వద్ద పెండింగులో లేదు-కేంద్ర మంత్రి - లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
AP HIGH COURT ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద పెండింగులో లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక హైకోర్టును ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి బదిలీ చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
AP HIGH COURT: ఏపీ హైకోర్టు బదిలీకి సంబంధించి..తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదంటూ కేంద్రం తేల్చి చెప్పింది. అలానే.. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని..కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు పార్లమెంటులో వెల్లడించారు. వైకాపా ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింత మాధవి అడిగిన ప్రశ్నకు.. కిరణ్ రిజుజు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఒక హైకోర్టును ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి బదిలీ చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి కేంద్రానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని.. అయితే ఇప్పటివరకు అలాంటిదేమీ రాలేదని చెప్పారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు అనుమతించాలని సీఎం జగన్ 2020 ఫిబ్రవరిలో కోరినా.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు.
TAGGED:
ap latest news