ETV Bharat / city

ఈనెల 17న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం

ap ts map
ap ts map
author img

By

Published : Feb 12, 2022, 11:28 AM IST

Updated : Feb 12, 2022, 2:06 PM IST

11:26 February 12

కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో జరగనున్న సమావేశం

ఈనెల 17న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం

Telugu States Partition Issue: తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత విభజన వివాదాలపై కేంద్రం ఎట్టకేలకు దృష్టి సారించింది. సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం... ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మొదటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం 9 అంశాలతో కూడిన అజెండాతో సమావేశానికి సిద్ధంకావాలని.. ఇరురాష్ట్రాలకు సమాచారం పంపింది.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. తెలుగురాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల పంపకాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన సహా ఇతర అపరిష్కృత అంశాలపై.. ఈనెల 8నే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం.. ఈనెల 17న మొదటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమావేశానికి.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌ నేతృత్వం వహించనుండగా.. ఏపీ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొంటారు. సమావేశంలో మొత్తం 9 అంశాలపై చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం.. ఇరురాష్ట్రాలకు అజెండా ప్రతిని పంపింది.

సమావేశంలో చర్చించే ప్రధాన అంశాలు..

1. ఏపీ ఫైనాన్స్‌ కొర్పొరేషన్‌ విభజన

2. విద్యుత్ వినియోగ అంశాలు

3. పన్ను అంశాల్లో సవరణలు

4. ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ సంస్థలో నగదు అంశం

5. వనరుల సర్దుబాటు

6. 7 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం

7. ప్రత్యేక హోదా

8. పన్ను ప్రోత్సాహకాలు

9. వనరుల వ్యత్యాసం

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు: నారా లోకేశ్‌

Last Updated : Feb 12, 2022, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.