పోలవరం ప్రాజెక్టు కోసం నాబార్డుతో రుణ ఒప్పందం చేసుకున్న తర్వాత బడ్జెట్‌లో కేటాయింపులు అవసరం లేదని చెబుతున్నా.... కేంద్ర ఆర్థికశాఖ మాటలు మాత్రం మరొలా ఉన్నాయి. ఏ బడ్జెట్ హెడ్ కింద పోలవరానికి నిధులు ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాయడం విస్తుపోయే అంశం. 2019-20 ఆర్థిక ఏడాదిలో పోలవరానికి కేంద్రం నుంచి ఒక్క పైసా విడుదల కాలేదు. రాష్ట్రానికి 5వేల 137 కోట్లు రావాల్సి ఉండగా...1850 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇప్పటికీ రెండు నెలలు గడిచినా...రాష్ట్ర ఖజనాకు ఆ సొమ్ము చేరలేదు.
* 2010-11 లెక్కల ప్రకారం పోలవరం అంచనా వ్యయం: రూ.16010.45 కోట్లు
* 2017-18 లెక్కల ప్రకారం రెండో డీపీఆర్ అనుగుణంగా అంచనా వ్యయం: 55548.87 కోట్లు
* ఈ మేరకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదమూ లభించింది.
* ప్రస్తుతం ఆర్థికశాఖ నియమించిన ఆర్‌సీఈ కమిటీ పరిశీలనలో ఉంది.
* 2020 జనవరి 25 వరకు పోలవరంపై చేసిన ఖర్చు: రూ.17,000.30 కోట్లు
* జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చు: రూ.11,864.43 కోట్లు
* ఇందులో పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చింది: రూ.6727.26 కోట్లు
* ఇంకా రావాల్సిన మొత్తం: 5,137.17 కోట్లు
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే మిగిలింది: బుగ్గన