ap disha bill in rajya sabha: దిశ బిల్లుపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని మహిళా భద్రతా విభాగం వ్యక్తం చేసిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివరణలు కోరామని, అవి ఇంకా రావాల్సి ఉందని ఆ శాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్ మిశ్ర తెలిపారు. బుధవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు.
Ajaykumar mishra on ap disha bill: ‘ఏపీ దిశ-క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు-2019, ఏపీ దిశ (స్పెషల్ కోర్ట్స్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్) బిల్లు-2020లు... రాష్ట్రపతి అనుమతి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర హోంశాఖకు అందాయి. నిబంధనల మేరకు వీటిపై నోడల్ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లతో సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టాం. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ రెండు బిల్లులపై తన అభిప్రాయాలు, వ్యాఖ్యలు పంపింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును న్యాయశాఖ సలహా కోసం పంపాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ దిశ-క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ అమెండ్‌మెంట్) బిల్లు-2019పై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రతా విభాగం వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోసం ఎదురుచూస్తున్నాం’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
ఇదీ చదవండి: CM Jagan On OTS: ఓటీఎస్‌పై దుష్ప్రచారం విషయంలో కఠినంగా ఉండాలి: సీఎం జగన్