ETV Bharat / city

ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ.2,498.89కోట్లు విడుదల - Central Government funds Releases news

రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపుల విషయంలో రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.2,498.89 కోట్లను ఎఫ్​సీఐకి ఇచ్చింది. ఎఫ్​సీఐ ఈ మొత్తాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనుంది. ఇటీవల ఈ అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు.

ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ.2,498.89కోట్లు విడుదల

author img

By

Published : Mar 6, 2020, 10:19 PM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో రాష్ట్రంలో ధాన్యం సేకరణ, చెల్లింపుల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు ఎఫ్​సీఐకు రూ.2,498.89 కోట్లు విడుదల చేసింది. ఎఫ్​సీఐ ఈ మొత్తాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనుంది. రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపుల విషయంలో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై సంబంధిత మంత్రులతో ఉపరాష్ట్రపతి ఇటీవల చర్చించారు. ఎఫ్​సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో నిధులు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిధుల విడుదలపై వెంకయ్య హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

'ధాన్యం కొనుగోళ్ల నిధులు రావాలి.. మంజూరయ్యేలా చూడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.