కృష్ణాపురం ఉల్లిపాయలు వాటి పరిమాణం, తీవ్రత కారణంగా మన దేశంలో వంటకు ఉపయోగించరు. వీటిని థాయిలాండ్, హాంకాంగ్, మలేషియా, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాలు దిగుమతి చేసుకుంటాయి. వీటిని ఎగుమతి చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యానవన విభాగం నుంచి సర్టిఫికెట్ పొందవలసి ఉంటుందని కేంద్ర డీజీఎఫ్టీ ప్రకటనలో పేర్కొంది. ధ్రువీకరణ పత్రాన్ని చెన్నైలోని డీజీఎఫ్టీ జోనల్ కార్యాలయం ద్వారా పొందాలి. ఈ కార్యాలయం ఎగుమతి చేసే మొత్తం ఉల్లిపాయల పరిమాణాన్ని పర్యవేక్షిస్తుంది. దాని ఆధారంగా ధృవీకరణ పత్రాన్ని ఇస్తుంది. ఈ ధ్రువీకరణ పత్రం ఆధారంగా కస్టమ్స్ అధికారులు ఎగుమతికి అనుమతిస్తారు.
దేశీయ మార్కెట్లో వస్తువుల లభ్యతను పెంచడానికి ఈ ఉల్లిపాయల ఎగుమతిని 2019 సెప్టెంబర్‌లో ప్రభుత్వం నిషేధించింది. వ్యాపారులపై స్టాక్ పరిమితులు విధించింది. అయితే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి సరఫరాలో అంతరాయం కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. దేశ రాజధానిలో ఉల్లి ధరలు ప్రస్తుతం కిలో రూ .60 వరకు ఉన్నాయి. కృష్ణాపురం ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం రైతులను ప్రభావితం చేసింది. వీటిపై ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వైకాపా సభ్యులు పార్లమెంటులో కోరారు.
ఇవీ చదవండి.. తల్లీ కూతుళ్ల హత్య కేసులో... నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు