ETV Bharat / city

ప్చ్‌... ఎగరలేం!... విమాన ఛార్జీలకు ‘క్యాప్‌’ పెట్టేదెవరు.? - ఉడాన్‌ ఆశయానికి గండి

FLIGHT CHARGES: విమాన ఛార్జీల్లో హెచ్చుతగ్గులు భారీగా ఉంటున్నాయి. ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో సమయంలో విదేశీ ప్రయాణమే కాదు దేశంలో వివిధ నగరాలకు వెళ్లాలన్నా భారమవుతోంది. సామాన్యుడు ఆకాశయానం చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉడాన్‌(ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం ద్వారా ప్రాంతీయ విమానాశ్రయాలను ప్రోత్సహిస్తోంది. టికెట్‌ ధరలు ఒక్కోసారి పైపైకి చేరుతుండటంతో ఆ ఆశయానికి గండి పడుతోంది.

FLIGHT CHARGES
విమాన ఛార్జీలు
author img

By

Published : May 30, 2022, 7:18 AM IST

FLIGHT CHARGES: సామాన్యుడు ఆకాశయానం చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉడాన్‌(ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం ద్వారా ప్రాంతీయ విమానాశ్రయాలను ప్రోత్సహిస్తోంది. టికెట్‌ ధరలు ఒక్కోసారి పైపైకి చేరుతుండటంతో ఆ ఆశయానికి గండి పడుతోంది. కరోనా సమయంతో పోల్చితే దేశీయ విమాన టికెట్‌ ధరలు పలు మార్గాల్లో కొన్నిసార్లు వంద శాతానికి మించి పెరిగాయి. ప్రస్తుతానికి అప్పటి ధరలకు కొంచెం అటూఇటూగా ఉన్నా సెలవు రోజుల్లో పెరుగుదల అధికంగా ఉంటోంది. కొవిడ్‌ కారణంగా గడిచిన రెండేళ్లుగా ప్రయాణాలకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు.

విమానయాన సంస్థలు పలు సర్వీసులను తగ్గించుకున్నాయి. నష్టాల కారణంగా ఒకట్రెండు విమానయాన సంస్థలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో విమాన టికెట్‌ల ధరలను తగిన మేరకు నియంత్రిస్తామని తెలిపింది. ‘విమాన టికెట్‌ ధరలపై కేంద్ర నియంత్రణ(క్యాప్‌)అవసరం. అప్పుడు ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ రంగంపై ఆధారపడిన పలు విభాగాల వ్యాపారమూ వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. కానీ డిమాండుకు తగిన విమాన సర్వీసులు అందుబాటులో లేవు. ఆ కారణంగా టికెట్‌ ధరలను పెంచేస్తున్నారు’ అని ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాల ఛైర్మన్‌ నగేష్‌ పంపాటి అన్నారు.

సాధారణ స్థితికి చేరువలో...

కరోనా నుంచి తేరుకోవటంతో గడిచిన అయిదారు నెలలుగా హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాల పరిధిలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ గణాంకాల ప్రకారం హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి కరోనాకు ముందు నెలకు సగటున రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య 16 లక్షలు. గత నెలలో ఇది 14 లక్షలకు పైగా ఉంది. టికెట్‌ ధరలు ఎక్కువగా పెరగకపోతే ఆ సంఖ్య మరింత పెరిగేదని హైదరాబాద్‌లోని స్నేహ ట్రావెల్స్‌ యజమాని జగన్‌మోహన్‌రెడ్డి ‘ఈనాడు'తో చెప్పారు.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.