ETV Bharat / city

CARVY CASE: కార్వీ కేసు.. స్టాక్ బ్రోకింగ్ కార్యాలయాల్లో సీసీఎస్ పోలీసుల తనిఖీలు - కార్వీ వార్తలు

బ్యాంకులను మోసం చేసిన హైదరాబాద్​లోని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కార్యాలయాల్లో సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేశారు. పలు లాప్ టాప్​లు, ఐఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

karvy
కార్వీ స్టాక్ బ్రోకింగ్
author img

By

Published : Aug 27, 2021, 7:33 AM IST

హైదరాబాద్​లోని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కార్యాలయాల్లో సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేసి పలు లాప్ టాప్​లు, ఐఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కార్వీ ఛైర్మన్ పార్థసారథి ఇంటికి వెళ్లిన పోలీసులు కుటుంబ సభ్యుల సమక్షంలో సోదాలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సెబీ నిషేధం విధించిన తర్వాత కార్వీ కార్యాలయంలో ఏయే లావాదేవీలు జరిగాయనే విషయాలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు.

బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించకపోవడంతో.. సదరు బ్యాంకులు తాఖీదులు ఇచ్చాయి. అయినా వాటికి ఎందుకు స్పందించలేదనే విషయాన్ని పార్థసారథి నుంచి అడిగి తెలుసుకున్నారు. కార్వీ మోసాలపై మరో పది మంది హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు సమాచారమిచ్చారు. షేర్ల క్రయవిక్రయాల కోసం కాగితాలపై సంతకాలు చేయించుకొని.. ఆ తర్వాత తమకు తెలియకుండానే మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. మీ షేర్ల లావాదేవీల్లో నష్టాలు వచ్చాయంటూ అబద్దాలు చెప్పి మోసం చేశారని బాధితులు, కార్వీ సంస్థపై ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: karvy MD arrest: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ఎండీ పార్థసారథి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.