కరోనా విజృంభనతో అభివృద్ధి చెందిన దేశాలే అతలాకుతలం అవుతున్నాయని.. జనసాంద్రత ఎక్కువగా ఉండే భారత్‌లో వైరస్ కట్టడిని నిరోధించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేషన్ కె.మిశ్రా అన్నారు. లోకల్ ట్రాన్స్మిషన్ పెరుగుతుండటం.. మూడవ దశ ప్రారంభమనే సంకేతాలిస్తున్నాయని.. ఇది చాలా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ వంటి చర్యలు అత్యవసరమని.. ఇందుకు ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. వేసవి, వ్యాక్సిన్‌పై మనం ఆధారపడలేమని... సామాజిక దూరమే విరుగుడని వెల్లడించారు.
ఇదీ చదవండి: వీరికి కరోనా పరీక్షలు తప్పనిసరి!