కరోనా సోకిన వారి ముక్కు, నోటి ద్వారా మాత్రమే కాక వారు విసర్జితాల్లో సైతం వైరస్ ఉంటుందని గతంలోనే డబ్లూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రాల నుంచి తెచ్చిన నీటిని సీసీఎంబీ, ఐఐసీటీ వారు సంయుక్తంగా పరీక్షించారు.
నగరంలో రోజు 1800 మిలియన్ల నీటిని వినియోగిస్తుండగా అందులో 40 శాతం నీరు వివిధ శుద్ధి కేంద్రాల్లో రీసైకిల్ చేస్తున్నారు. అందులో దాదాపు 80 శాతం కేంద్రాల నుంచి సేకరించిన మురుగునీటిని పరీక్షించగా అందులో 2లక్షల మంది విసర్జితాల్లో వైరస్ ఉన్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించిన నివేదికలను సైతం సీసీఎంబీ బహిర్గతం చేసింది.
నగర ప్రజలు వినియోగిస్తున్న మొత్తం నీటిలో కేవలం 40 శాతం నీరు మాత్రమే నీటి శుద్ధి కేంద్రాలకు వస్తున్న నేపథ్యంలో నగరంలో రమారమీ 6 లక్షల మందికి వైరస్ సోకి ఉండే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చినట్టు పేర్కొంది. అందులోనూ అత్యధికుల్లో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదన్న సీసీఎంబీ.... అలాంటి వారు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
సీసీఎంబీ పరీక్షల్లో 2వేల మందికి కోరనా సోకినట్టు నిర్ధరణ కాగా..... నగరంలో వినియోగిస్తున్న మొత్తం నీటిని పరీక్షిస్తే సుమారు 6లక్షల మందికి అంటే నగర జనాభాలో 6 శాతం మందికి కరనా సోకినట్టు నిర్ధరణ అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: