మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహం నుంచి విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు...ఇవాళ వివేకా కుమార్తె సునీతను దాదాపు 3 గంటల పాటు విచారించారు. సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు సునీత... నల్లటి బ్యాగుతో లోపలికి వెళ్లారు. సీబీఐ అధికారులకు వివరించేందుకు తన వద్దనున్న ఆధారాలు, వివిధ రకాల దస్త్రాలను తీసుకెళ్లినట్లు సమాచారం.
వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సునీత హైకోర్టును ఆశ్రయించింది. 15 మందిపై అనుమానం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సునీత విచారణ కంటే ముందే ఉదయం నుంచి.. సస్పెన్షన్ కు గురైన పులివెందుల సీఐ శంకరయ్యను విచారించింది. నిన్న 4 గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు.... ఇవాళ ఉదయం నుంచి సునీత వచ్చే వరకు సీఐని విచారించారు. విచారణ ముగిసిన తర్వాత బయటికి వచ్చిన శంకరయ్య.. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
ఇదీ చదవండి :
వివేకా కేసులో సిట్ దర్యాప్తు నివేదికను అధ్యయనం చేస్తున్న సీబీఐ