ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో బెయిల్ షరతులు సడలించాలని గాలి జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... గాలి జనార్ధన్‌రెడ్డి పిటిషన్‌ను వ్యతిరేకించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున్న బెయిల్ షరతు సడలించొద్దని కోరారు.
మరోవైపు సీబీఐ ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది. అయితే ఈ అంశంలో వివరంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అలాగే ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సీబీఐని కూడా ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి
అభివృద్ధి పనులు చేయాలంటే ఈసీ అనుమతి తీసుకోండి..: సుప్రీంకోర్టు