హైకోర్టుతో పాటు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసును విచారిస్తున్న విశాఖ సీబీఐ అధికారులు... ఈనెల 22న (ఆదివారం) విజయవాడలో విచారణ చేపట్టనున్నారు. అధికార పార్టీ ముఖ్య నేతలతో పాటు కొందరు కార్యకర్తలు ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లలో పోస్టులు పెట్టారు. దీనిపై గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. లేఖను సుమోటోగా తీసుకున రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి పోస్టులను ఎవరైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. అలాగే బాధ్యులపై విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది. అయితే సీఐడీ విచారణలో పురోగతి లేకపోవటంతో కొద్దిరోజుల క్రితం విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. దీంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో తగిన సాక్ష్యాలతో రావాలని న్యాయవాది లక్ష్మీనారాయణకు సూచించారు. అన్ని వివరాలను సీబీఐకి సమర్పించనున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి