ETV Bharat / city

హైదరాబాద్​లోని గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్​పై సీబీఐ కేసు

గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. రుణాల పేరుతో బ్యాంకులకు రూ. 1,285 కోట్ల నష్టం కలిగించారన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది.

golden jubilee hotels
గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్​
author img

By

Published : Apr 2, 2021, 7:45 AM IST

విలాసవంతమైన ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మిస్తామంటూ రుణాలు తీసుకొని ఏకంగా రూ.1,285.45 కోట్ల మోసానికి పాల్పడిన నేరంపై హైదరాబాద్‌ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. గోల్డెన్‌ జుబ్లీ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లక్ష్మీనారాయణ శర్మ, అర్జున్‌సింగ్‌ ఒబెరాయ్‌, నేహా ఒబెరాయ్‌, యశ్‌దీప్‌ శర్మ, గుర్తుతెలియని వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులను ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఏడు బ్యాంకుల నుంచి వ్యాపారం నిమిత్తం తీసుకున్న రుణాల్లో కొంత కుట్రపూరితంగా, దురుద్దేశంతో ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

bank of baroda
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

ఏడు బ్యాంకుల నుంచి రూ.678.89 కోట్ల రుణం: గోల్డెన్‌ జుబ్లీ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1996 డిసెంబరు 18న శిల్పారామం వెనుకవైపు ఉన్న శిల్పకళావేదిక చిరునామాతో ఏర్పడింది. హోటల్‌ ట్రైడెంట్‌, హోటల్‌ ఒబెరాయ్‌ పేర్లతో ఐదు నక్షత్రాల హోటళ్లు రెండు నిర్మించే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల్లో ఒబెరాయ్‌ హోటల్‌తోపాటు సర్వీస్‌ అపార్టుమెంట్లు కూడా నిర్మించతలపెట్టారు. 323 గదులతో నిర్మించిన ట్రైడెంట్‌ హోటల్‌ 2013 నుంచి అందుబాటులోకి రాగా.. ప్రస్తుతం 60 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణానికి సంబంధించి 2007 మార్చి 30న అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పర్యాటక సాంస్కృతిక శాఖకు చెందిన 5.06 ఎకరాల భూమిని నిర్మాణం, నిర్వహణ, బదిలీ (బీఓటీ) పద్ధతిలో 33 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. ఇందుకోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.254.42 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ.112.30 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంక్‌ నుంచి రూ.92.90 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ నుంచి రూ.68.94 కోట్లు, సిండికేట్‌ బ్యాంక్‌ నుంచి రూ.65.66 కోట్లు, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌ నుంచి రూ.42.98 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి రూ.41.59 కోట్లు చొప్పున మొత్తం రూ.678.89 కోట్ల రుణం తీసుకున్నారు.

నిలిచిన పనులు.. పేరుకున్న బకాయిలు

ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణం పూర్తికాకపోగా సంస్థ యాజమాన్యం మధ్య తలెత్తిన వివాదాల కారణంగా 2015 నుంచి ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అదనంగా భాగస్వాములను తెచ్చి.. మరో రూ.150 కోట్లు సమకూర్చుకొని నిర్మాణం పూర్తి చేయాలనుకున్నప్పటికీ సఫలం కాలేదు. రెండో ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో ట్రైడెంట్‌ హోటల్‌ ద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంకుల బకాయిలు చెల్లించడం సాధ్యం కాలేదు. దాంతో మొత్తం సంస్థ నిరర్థక ఆస్తిగా మారింది. రుణం ఇచ్చిన బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఉదాహరణకు 2016 మార్చి 31న సంస్థ ఎవైలబుల్‌ రీసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రూ.5.46 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఖాతాల్లో చూపించింది. దీనికి సంబంధించిన రశీదులు మాత్రం సమర్పించలేదు. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కొనుగోలు జరిపిన గోల్డెన్‌ జుబ్లీ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విక్రయించిన ఎవైలబుల్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల రెండింటి చిరునామా ఒక్కటేనని తేలింది. ఇలాంటి అవకతవకలు ఎన్నో జరిగినట్లు ఆడిట్‌లో గుర్తించారు. అన్ని రకాల బకాయిలు కలిపి ఏడు బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,285.45 కోట్లకు చేరింది. వ్యాపారం కోసం తీసుకున్న రుణం ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించడంతోపాటు మోసానికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ గత మంగళవారం కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: సలాం కేసు సీబీఐ విచారణకు అక్కర్లేదు : హైకోర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.