ETV Bharat / city

ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు..క్యాట్​కు వెంకటేశ్వరరావు నివేదన

author img

By

Published : Feb 24, 2020, 5:06 PM IST

Updated : Feb 25, 2020, 6:25 AM IST

సీనియర్‌ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై క్యాట్‌లో విచారణ జరిగింది. వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ కౌంటర్‌పై వివరణ ఇస్తూ ఏబీ వెంకటేశ్వరరావు అఫిడవిట్‌ సమర్పించారు. కనీస విచారణ లేకుండా సస్పెండ్‌ చేయడం చట్టవిరుద్ధమని ఏబీ తరపు న్యాయవాది వాదించారు. అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్‌ చేశారన్నారు. వాదనలు విన్న కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌... తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.

సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై క్యాట్‌లో విచారణ

ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందంటూ సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించిన వేళ... వేతనం చెల్లించామని పేర్కొంటూ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. ఈమేరకు ఈనెల 18న ప్రభుత్వం మెమో జారీ చేసిందని.. జీఏడీ డిప్యూటీ కార్యదర్శి కౌంటరులో పేర్కొన్నారు. సస్పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వానికి అప్పీలు చేసుకొనే అవకాశం ఉన్నా.. ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడం చట్ట విరుద్ధమన్నారు. డ్రోన్ల కొనుగోళ్లలో... కుమారుడికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినందునే... సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు బదులిచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు... నాడు టెండరు కమిటీ సమావేశంలో సభ్యుడిగా పాల్గొనడం తప్ప తనకు ఎలాంటి పాత్ర లేదన్నారు. కొనుగోళ్ల ప్రతిపాదన సైతం నిలిచిపోయినందున ఆర్థిక అవకతవకలకు తావే లేదన్నారు. విచారణలో తనపై లభించిన ప్రాథమిక ఆధారాలేంటో చెప్పాలన్నారు. ఈనెల 18న వేతనం చెల్లించినప్పటికీ... ఇన్నాళ్లూ ఎందుకు ఆపారో ప్రభుత్వం వివరణ ఇవ్వలేదన్నారు. సరైన కారణం లేకుండా ఓ ఉన్నతాధికారిని సస్పెండ్ చేసి, అవమానించడం శిక్షేనన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం... క్యాట్‌ ధర్మాసనం విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

'ప్రతిపక్షాలను వేధించడమే ప్రభుత్వ లక్ష్యం'

Last Updated : Feb 25, 2020, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.