తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు ఇండోనేసియాకి చెందిన వారు కాగా...మరొకరు లండన్ నుంచి వచ్చిన 18 ఏళ్ల యువతి.
ఈ నెల 14న కరీంనగర్లో సంచరించిన ఇండోనేసియా బృందంలోని అందరికి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. వీరిలో మొదటి వ్యక్తికి ఈనెల 16న కరోనా నిర్ధారణ కాగా.. 18న ఏడుగురికి... ఈ రోజు మిగతా ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరడం వల్ల... అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.