కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కొంతమంది ఉద్యోగులే సచివాలయానికి హాజరయ్యారు. 30 శాతం మంది ఉద్యోగులు మాత్రమే రావడంతో.. సచివాలయం వెలవెలబోయింది. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా బ్లాక్‌లు అన్ని ఖాళీగా ఉన్నాయి. సందర్శకులకు అనుమతి లేదని సచివాలయం వెలుపల బోర్డులు పెట్టారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజా రవాణా, ఆర్టీసీ బస్సులు నిలిపివేయటంతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులూ సొంత వాహనాలపైనే హాజరవుతున్నారు.
ఇదీ చదవండి: 'ఎయిర్ ఇండియా' తెగువకు ప్రధాని ప్రశంసలు