ETV Bharat / city

లారీల మధ్య ఇరుక్కున్న కారు​... 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​​ - రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్​

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై ఓ వింత సంఘటన జరిగింది. డ్రైవర్ల అత్యుత్సాహమో.. అతివేగం వల్లనో.. 2 భారీ లారీల మధ్యలో ఓ కారు ఇరుక్కుపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ.. రోడ్డుపైనే వాహనాలు నిలిపేసి డ్రైవర్లు వాగ్వాదానికి దిగటం వల్ల 2 కిలోమేటర్ల మేర ట్రాఫిక్ ​జామ్​ అయ్యింది.

car-struck
car-struck
author img

By

Published : Nov 5, 2020, 7:15 PM IST

లారీల మధ్య ఇరుక్కున్న కారు​... 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​

తెలంగాణలోని.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని వంతెన వద్ద ప్రమాదవశాత్తు... 2 లారీల మధ్య ఓ కారు ఇరుక్కుపోయింది. రోడ్డు మధ్యలో నిలిచిపోవటం వల్ల హైదరాబాద్‌ శివారులోని ఈ మార్గంలో రాకపోకలు చేస్తున్న వాహనాలు.. పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. నీది తప్పంటే... నీది తప్పు అంటూ లారీ, కారు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు.

ఫలితంగా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నడి రోడ్డుపై ఆగిపోయాయి. ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారుకు ఎలాంటి నష్టం కలగకుండా లారీలను తప్పించే ప్రయత్నం చేశారు.

ఇదీ చూడండి:

పసిడి కాస్త ప్రియం - వెండిదీ అదే దారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.