ETV Bharat / city

రాశిఫలం: మకరం - మకర రాశి న్యూస్

ఈ ఏడాది మకరం రాశివారికి ఎలా ఉంటుందో చూద్దాం...

రాశిఫలం: మకరం
రాశిఫలం: మకరం
author img

By

Published : Dec 31, 2020, 10:52 PM IST

మొత్తంగా 2021 సంవత్సరం మీకు గొప్పగా ఉంటుంది. సంవత్సర ప్రారంభం నుంచి ఏదైనా సాధించాలనే తపన మీలో ఉంటుంది. మీ ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ మీరు చక్కని సాన్నిహిత్యాన్ని చూస్తారు. వ్యాపారపరంగా చూస్తే ఆర్థికంగా ఈ సంవత్సరం లాభసాటిగా ఉంటుంది. మీ వ్యాపారం పరిఢవిల్లుతుంది. మీ వివాహం విదేశాల్లో జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయిు. వ్యాపారపరంగా దూరప్రయాణం ఈ సంవత్సరం మీకు కలిసొస్తుంది. మీ కంటే చిన్నవారైన తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు మీకు అండగా ఉంటారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండేలా వారు ప్రయత్నిస్తారు. మీ తెలివితేటలు, కఠిన శ్రమతో వృత్తిపరంగా మీరు విజయం సాధించే సూచనలు అధికంగా ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన ప్రయోజనాలు కూడా మీరు అందుకుంటారు. దాని కోసం మీరు ఎక్కువ శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇల్లు కొనాలనే ఆలోచనలో మీరు ఉంటే ఈ సంవత్సరం ఆ కోరిక నెరవేరుతుంది. మీ సంతానం కూడా జీవితంలో మంచి పురోగతి చూస్తారు. మీరు విద్యార్థి అయితే కొన్ని ఆటంకాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మీరు వ్యాపారి లేదా ఉద్యోగి అయితే కొత్త విజయశిఖరాలు అందుకుంటారు. మీకు పాత కోరికలు, ఇష్టాలు ఉండవచ్చు, కాని అదే సమయంలో మీరు సంతృప్తిగా ఉంటారు కాబట్టి మీరు మంచి వ్యక్తిగా ఉంటారు. మీరు డబ్బు వెనుక పడకుండా కుటుంబంపై అధిక దృష్టి సారిస్తారు. పేదలకు సాయం చేయాలనే భావన మీలో ఉంటుంది కాబట్టి మీరు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాని వలన మీరు మనశ్శాంతి పొందుతారు. దేవుడిపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఇతరులకు సాయపడటం ద్వారా మీరు గౌరవం పొందడమే కాదు అదృష్టాన్ని ఆహ్వానిస్తారు. మీరు మంచి పేరు తెచ్చుకుంటారు, కాని దాని వలన అహంకారం చోటుచేసుకుంటే అది సమస్యలకు దారితీయవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.