Amaravati issue Dates: రాష్ట్ర విభజన తర్వాత 2014 సెప్టెంబరు 3న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం చేసింది. అప్పటి నుంచి గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పు వరకు రాజధాని అంశంలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఏం జరిగాయంటే...
- 2014 సెప్టెంబరు 3: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం
- 2014 డిసెంబరు 23: ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ
- 2014 డిసెంబరు 30: ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం. సీఆర్‌డీఏ అథారిటీ ఏర్పాటు. 7,317 చ.కి.మీ.ల (తర్వాత దీన్ని 8,603 చ.కి.మీ.లకు పెంచారు) విస్తీర్ణంలో కేపిటిల్ రీజియన్‌ని, 217.23 చ.కి.మీ.లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం
- 2015 జనవరి 1: రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం
- 2015 ఫిబ్రవరి 28: కేవలం రెండు నెలల వ్యవధిలో 32,469 ఎకరాలు ఇచ్చిన 20,510 మంది రైతులు
- 2015 అక్టోబరు 22: ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన
- 2016 ఏప్రిల్ 25: వెలగపూడి సచివాలయాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు
- 2016 జూన్ 6: సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు ప్రక్రియ నేలపాడు గ్రామంతో ప్రారంభం.
- 2016 అక్టోబరు 28: పరిపాలన నగరానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన
- 2017 ఫిబ్రవరి 3: పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్, శాసనసభ, హైకోర్టు, సచివాలయ భవనాల ఆకృతుల రూపకల్పనకు లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థతో ఒప్పందం
- 2017 మార్చి 1: ప్రాథమిక డిజైన్లు అందజేసిన ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ
- 2017 మార్చి 2: వెలగపూడిలో అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు
- 2017 మే 15: స్టార్టప్ ఏరియాని సింగపూర్ కన్సార్షియం స్విస్‌ఛాలెంజ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ఒప్పందం. శంకుస్థాపన
- 2017 డిసెంబరు 27: రాజధాని నగరం అమరావతిని సందర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- 2019 ఫిబ్రవరి 3: హైకోర్టు ఐకానిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన. జ్యుడీషియల్ కాంప్లెక్స్ (ప్రస్తుత హైకోర్టు) ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగొయ్.
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు
- 2019 డిసెంబరు 17: మూడు రాజధానుల్ని ప్రతిపాదిస్తూ శాసనసభలో సీఎం ప్రకటన
- 2019 డిసెంబరు 18: సీఎం ప్రకటనకు నిరసనగా ఉద్యమం ప్రారంభించిన రాజధాని రైతులు
- 2019 డిసెంబరు 20: పరిపాలనను వికేంద్రీకరించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సు
- 2020 జనవరి 7: చినకాకాని వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన అన్నదాతలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనాన్ని చుట్టుముట్టిని రైతులు. రైతులతో పోలీసుల ఘర్షణ.
- 2020 జనవరి 10: పొంగళ్లు సమర్పించి, మొక్కులు చెల్లించుకునేందుకు విజయవాడకు వెళుతున్న రాజధాని మహిళలు, రైతులపై పోలీసుల దాష్టీకం. వెలగపూడి వద్ద రణరంగంగా మారిన సీడ్ యాక్సిస్ రోడ్డు
- 2020 జనవరి 20: చలో అసెంబ్లీకి రాజధాని రైతుల పిలుపు. అసెంబ్లీ సమీపానికి చేరుకున్న రైతులు.. పోలీసుల లాఠీఛార్జి
- 2020 జనవరి 20: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ
- 2020 జనవరి 22: బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి ఛైర్మన్‌కి తెదేపా సభ్యుల నోటీసులు. సభలో గందరగోళం. బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపుతూ అప్పటి మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం
- 2020 జూన్ 16: ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం
- 2020 జూన్ 17: మండలిలో తెదేపా సభ్యుల ఆందోళనతో చర్చకు నోచుకోని బిల్లులు
- 2020 జులై 18: బిల్లుల్ని గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం
- 2020 జులై 31: బిల్లులకు ఆమోదముద్ర వేసిన గవర్నర్
- 2020 ఆగస్టు 8: సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల చట్టాల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి కేసు
- 2021 మార్చి 8: మహిళా దినోత్సవం సందర్భంగా దుర్గ గుడికి వెళుతున్న మహిళా రైతుల్ని అడ్డుకున్న పోలీసులు. మహిళలపై దురుసు ప్రవర్తన. కొందరికి గాయాలు
- 2021 నవంబరు 1: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన రైతులు
- 2021 నవంబరు 11: ప్రకాశం జిల్లాలోని చదలవాడ వద్ద పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై పోలీసుల దాడి
- 2021 నవంబరు 22: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- 2022 మార్చి 3: రాజధాని రైతుల ఉద్యమం 807వ రోజుకి చేరింది. రాజధాని కేసులపై హైకోర్టు తీర్పు వెలువడింది.
ఇదీ చదవండి:
Amaravati farmers: రైతులపై అడుగడుగునా పోలీసు జులుం.. 27 నెలల్లో 3,852 కేసులు