ETV Bharat / city

TRAINS CANCELLATION: గులాబ్ తుపాన్ ప్రభావం.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు

గులాబ్ తుపాన్ ప్రభావంతో రైల్వే శాఖ అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే కొన్నింటిని దారి మళ్లించారు. మరికొన్నింటి రైళ్ల మార్గాలను కుదిరించారు.

Cancellation of trains due to the impact of Hurricane Gulab
గులాబ్ తుపాన్ ప్రభావంతో రైళ్ల రద్దు
author img

By

Published : Sep 26, 2021, 11:47 AM IST

Updated : Sep 26, 2021, 5:58 PM IST

గులాబ్‌ తుపాను ప్రభావంతో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అంతేకాకుండా కొన్ని రైళ్ల మార్గాలను కుదించడం, మరికొన్నింటి రైళ్ల దారి మళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 26న విశాఖ- విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ- జయనగరం వైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. 27న విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

ఈ నెల 26న పూరీ-ఓఖా ప్రత్యేక రైలును వయా ఖుర్థారోడ్‌, అంగూల్‌, సంబల్‌పూర్‌ మీదుగా దారి మల్లించినట్లు ఎ.కె.త్రిపాఠి పేర్కొన్నారు. 27న విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్‌ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల 28న జగదల్‌పూర్‌ నుంచి బయలు దేరుతుందన్నారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి కోరారు.

గులాబ్ తుపాను వల్ల ఈరోజు రద్దైన రైళ్ల వివరాలు..

  • భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు
  • భువనేశ్వర్- తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
  • పూరి- చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
  • రాయగడ- గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
  • భువనేశ్వర్ - కేఎస్ ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
  • సంబాల్ పూర్ - హెచ్. ఎస్ . నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
  • భువనేశ్వర్ - యంశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు

సోమవారం రద్దైన రైళ్ల వివరాలు..

  • చెన్నై సెంట్రల్ - పూరి ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
  • తిరుపతి - భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
  • హెచ్. ఎస్ . నాందేడ్- సంబాల్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
  • కేఎస్ ఆర్ బెంగళూరు- భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
  • యశ్వంత్ పూర్ - భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు

ఇదీ చూడండి: MPP SEATS: వైకాపా ఖాతాలో 626 ఎంపీపీ స్థానాలు

Last Updated : Sep 26, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.