ETV Bharat / city

ఎన్నికలు ఎప్పుడొచ్చినా శ్రేణులు సిద్ధంగా ఉండాలి: చంద్రబాబు - chandrababu comments on YCP

స్థానిక, జమిలీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పది ఓట్లలో 5 మారితే జగన్ ఇంటికెళ్లటమేనని జోస్యం చెప్పారు. జగన్ ఓ వింత, వితండ, విధ్వంస ముఖ్యమంత్రని ధ్వజమెత్తారు. వైకాపా అరాచకాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కడప పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Cadre should be ready for elections anytime: babu

author img

By

Published : Dec 9, 2020, 10:42 PM IST

ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపా ఓటమే లక్ష్యంగా పని చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. తెదేపా గెలుపే వైకాపా అరాచకాలకు గుణపాఠం కావాలన్నారు. సుంకాల సీఎంగా జగన్ ప్రజలకు భారంగా మారాడని ధ్వజమెత్తారు. అసమర్థత, అహంభావం, నిర్లక్ష్యానికి జగన్ ప్రతిరూపంగా మారాడని విమర్శించారు. అక్రమ సంపాదనే లక్ష్యంగా తాను,.. తన అనుచరుల అవినీతి కోసమే పాలసీలు చేస్తున్నారన్న చంద్రబాబు... అసెంబ్లీ వేదికగా తప్పుడు లెక్కలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయత లేని ఫేక్ పార్టీ వైకాపా, జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కడప జిల్లా పులివెందులలో ఎస్సీ మహిళను మానభంగం చేసి చంపేస్తే కనీస విచారణ లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వైకాపా నేతలు ఏదోరోజు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైకాపా ఉన్మాద చర్యల పట్ల ఎవ్వరూ మౌనం వహించవద్దని సూచించారు. లేని దిశ చట్టం పేరుతో ప్రజలను మభ్యపెట్టి పోలీస్​స్టేషన్లంటూ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా అండతో తప్పు చేసే పోలీసులకు శిక్షపడేవరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

వాలంటీర్లు సక్రమంగా పనిచేసి ఉంటే ఏలూరులో వింత వ్యాధి ఘటన జరిగేది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వం తెచ్చిన 1100 కాల్ సెంటర్, పరిష్కార వేదిక, రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయటం తప్ప... చేసిన తప్పులు సవరించుకునే నైజం వైకాపా నేతలకు లేదన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి.. లక్షలాది భవన నిర్మాణ కార్మికుల ఉసురు పోసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి.. నాసిరకం బ్రాండ్లతో మద్యం మాఫియాకు దోచిపెడ్తున్నారని ఆరోపించారు. ఇళ్లస్థలాల కేటాయింపులోనూ భారీ అవినీతి జరిగిందని వ్యాఖ్యానించారు.

వరద బాధితులకు ఇస్తామన్న రూ.500కు అతీగతీ లేదని చంద్రబాబు ఆక్షేపించారు. కరోనా బాధితులకు రూ.2వేలు ఇస్తామని ఎగ్గొట్టారన్న చంద్రబాబు... రాత్రికిరాత్రి బుగ్గవంక వాగు నీళ్లు వదిలి కడపను ముంచేశారని పేర్కొన్నారు. డిసెంబర్ వస్తున్నా రాష్ట్రంలో కరోనా తీవ్రతకు సంబంధించి ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పట్లో పంచాయతీ ఎన్నికలు పెట్టమని.. ఇప్పుడు అన్నిచోట్ల ఎన్నికలు జరుగుతుంటే వద్దంటున్నారని విమర్శించారు. వ్యవస్థలన్నా, న్యాయస్థానాలన్నా, ప్రజలన్నా జగన్​కు లెక్కలేదుని దుయ్యబట్టారు.

నాయకులేమన్నారంటే...

నెల్లూరు జిల్లాలో రైతులు వేసిన రెండో పంటలో భారీగా నష్టపోయారు. ధాన్యం ధర సగానికి కొనేవాళ్లు లేరు. రూ.16,000ల పుట్టి వరి ధాన్యం రూ.7000లకు అమ్ముకునే పరిస్థితి. పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక తరలిపోతోంది.-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు

ఉద్యాన పంటలకు ఎక్కడా తుంపర సేద్యం పరికరాలు అందించలేదు. పెట్టుబడి బీమా సకాలంలో చెల్లించకుండా రైతులను మోసం చేశారు. ఇసుక, మద్యంలో వైకాపా నేతలు భారీగా దోచుకుంటున్నారు.-బీటెక్ రవి, ఎమ్మెల్సీ

ఇదీ చదవండీ... 'గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాదు.. రైతు కన్నీరు తుడవండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.