ETV Bharat / city

ap cabinet meeting: ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పీఆర్సీ జీవోలకు ఆమోదం - AP Employees PRC

cm jagan
cm jagan
author img

By

Published : Jan 21, 2022, 2:04 PM IST

Updated : Jan 21, 2022, 5:37 PM IST

14:02 January 21

పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు ఆమోదం

ap cabinet meeting: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఒమిక్రాన్‌ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. ‘ఈబీసీ నేస్తం’ చెల్లింపులతో పాటు వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు ఈ ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదం సమ్మతించింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్టుకు పౌష్టికాహారం బాలామృతం, పాలు సరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఆమోదముద్ర వేసింది వీటికే...

  • కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై ఆమోదం
  • ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం
  • జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు
  • ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు
  • ఈబీసీ నేస్తం అమలుకు మంత్రివర్గం ఆమోదం
  • వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందానికి ఆమోదం
  • రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు అమలులో ఒప్పందం
  • ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం ఆమోదం

ఇదీ చదవండి

Attack on VRO : వీఆర్వోపై దాడి...పోలీసులకు ఫిర్యాదు...

Last Updated : Jan 21, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.