ETV Bharat / city

జనవరి నాటికి పంట నష్ట పరిహారం చెల్లించాలి: సీఎం - సీఎం​ అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం

ap cabinet meet in sachivalayam
ap cabinet meet in sachivalayam
author img

By

Published : Nov 27, 2020, 11:16 AM IST

Updated : Nov 27, 2020, 2:09 PM IST

11:13 November 27

2 గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో భారీ వర్షాలు, నివర్ తుపానుపై చర్చించారు. నష్టపరిహారంపై అంచనాలను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పరిహారం చెల్లించాలని సీఎం తెలిపారు. 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని సీఎం సూచించారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందజేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో  అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ ముసాయిదా బిల్లులకు ఆమోదంపై చర్చించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం పథకాలపైనా చర్చించారు. ఉద్యోగులకు దశల వారీగా డీఏ బకాయిల చెల్లింపులతో పాటు పలు అంశాలపై చర్చ సాగింది. 

ఇదీ చదవండి: వాగులో కారు గల్లంతు..10 కి.మీ ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన యువకుడు

Last Updated : Nov 27, 2020, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.