ETV Bharat / city

'ముగ్గురి పేర్లను పంపితే ఒక్కరినే ఎలా నియమించారు ' - ap Land acquisition authority

భూసేకరణ అథారిటీలకు ప్రిసైడింగ్ అధికారుల నియామకానికి గత సీజే మూడు పేర్లను పంపితే.. ఏ వివరాల ఆధారంగా ఒక్కరినే నియమించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మిగిలిన ఇద్దరి పేర్లను ఎందుకు పరిగణలోనకి తీసుకోలేదో తెలపాలని వివరణ కోరింది.

hc
hc
author img

By

Published : Jul 14, 2021, 2:42 AM IST

భూసేకరణ అథారిటీలకు ప్రిసైడింగ్ అధికారుల నియామకానికి హైకోర్టు గత సీజే మూడు పేర్లను పంపితే .. ఏ వివరాల ఆధారంగా ఒక్కరినే ఎలా నియమించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది . మిగిలిన రెండు పేర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని వివరణ కోరింది . అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ బదులిస్తూ .. ఒకరి విషయమై ప్రభుత్వం వద్ద , హైకోర్టు వద్ద బయోడేటా ఉందని తెలిపారు . మిగిలిన ఇద్దరి విషయంలో హైకోర్టు వద్ద , ప్రభుత్వం వద్ద బయోడేటా లేదన్నారు . ఆ ఇద్దరి ప్రిసైడింగ్ అధికారుల వ్యవహారంలో హైకోర్టు , ప్రభుత్వం మధ్య ప్రభావవంతమైన సంప్రదింపుల ప్రక్రియ జరగలేదన్నారు . ఆ వివరాల్ని అఫిడవిట్ రూపంలో వేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది . అందుకు ఏజీ అంగీకరించడంతో విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది . పిటిషనర్ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ .. సంప్రదింపులు సక్రమంగా జరగకపోతే విశాఖ పీవోను ఏవిధంగా నియమించారని ప్రశ్నించారు . విశాఖ పీవో బయోడేటా ఎవరిచ్చారో తేల్చాలన్నారు.

ఇదీ చదవండి: AndhraPradesh: హైకోర్టు పరిధిలో మూడు రాజధానుల అంశం: కేంద్ర హోంశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.