హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) సంస్థ.. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)ఎండీ ఎన్. బంగార్రాజు తెలిపారు. మంగళవారం తాడేపల్లిల్లోని సంస్థ కార్యాలయం నుంచి సీడాక్ అధికారులతో వర్చువల్ విధానం ద్వారా సమావేశం నిర్వహించారు.
బీఈ, బీటెక్, ఇతర సమానమైన అర్హతలు ఉన్నవారికి సీడాక్ సంస్థ పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించిందని బంగార్రాజు వెల్లడించారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ (సీ-డాక్) సంస్థ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని.. వారి సహకారంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న మూడు కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఒక్కో కోర్సు 100 గంటలపాటు ఉంటుందని.. ఇందులో 60 గంటలు థియరీ, 40 గంటలు ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి ఎపీఎస్‌ఎస్‌డీసీ - సీడాక్ సంయుక్తంగా సర్టిఫికేట్ జారీ చేస్తాయని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ప్రారంభం అవుతుందని.. ఆసక్తి ఉన్నవారు ఎపీఎస్‌ఎస్‌డీసీ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని బంగార్రాజు వివరించారు.
ఇదీ చదవండి:
Nara Lokesh: పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు?: లోకేశ్