శాసనమండలి చైర్మన్ వెంటనే ఎమ్మెల్సీ పోతుల సునీత, శివనాథరెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. పార్టీ విప్ ఉల్లంఘించినందున వారిపై అనర్హత వేటు వేయాలని తాము ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ రోజు మండలి ఛైర్మన్ విచారణలో ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్‌బాబు పాల్గొన్నారు. మండలిలో పలు బిల్లులపై పార్టీ విప్‌కు విరుద్ధంగా.. ప్రభుత్వానికి అనుకూలంగా ఇద్దరు ఎమ్మెల్సీలు ఓటు వేశారని ఫిర్యాదు చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు ఇద్దరు కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. శాసనమండలి అవసరం లేదన్న సీఎం.. మండలి సభ్యులను ఎందుకు కొనుగోలు చేస్తున్నారని నిలదీశారు. గవర్నర్‌కోటాలో వచ్చిన తనకు విప్ వర్తించదు అని శివనాథరెడ్డి ఎలా అంటారని ప్రశ్నించారు. గవర్నర్ పిలిచి శివనాథరెడ్డికి పదవి ఇవ్వలేదని... చంద్రబాబు గవర్నర్ కు సిఫార్సు చేస్తేనే పదవి వచ్చిందని బుద్దా వెంకన్న అన్నారు.
ఇదీ చదవండి: 'మీ ఇళ్లకు వేసుకోండి వైకాపా రంగులు'