రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక పరిధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారని మంత్రి శంకరనారాయణ వ్యాఖ్యనించారు. రాజధాని అంశంపై బొత్స ప్రకటనను ఆయన సమర్థించారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే తెదేపా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. అనంతపురంలో దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులకు కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏడీఐపీ పథకం ద్వారా 85 లక్షల వ్యయంతో దివ్యాంగులకు పరికరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు
.
ఇదీచదవండి