తెదేపా అధినేత చంద్రబాబు.... ఆంధ్రప్రదేశ్ రాజధానికి చిరునామా లేకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సర్వే ఆఫ్ ఇండియా..... భారతదేశ రాజకీయ పటాన్ని విడుదల చేస్తే అందులో ఏపీ రాజధాని పేరే లేదని... ఇది పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యమని బొత్స వ్యాఖ్యానించారు. తెదేపాలో పనిచేసి భాజపాలో చేరిన వ్యక్తులు రాజధానిపై ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని, రాష్ట్రంలోని ప్రాజెక్టుల అభివృద్ధిపై కమిటీ వేశామని... నివేదిక వచ్చాక రాజధాని వివరాలు చెబుతామని బొత్స తెలిపారు. సీఎస్ బదిలీపై స్పందిస్తూ... ఈ చర్య పాలనా వ్యవహారాల్లో భాగమని, చర్చించాల్సిన అంశం కాదని బొత్స అన్నారు.
ఇదీ చూడండి: