ETV Bharat / city

అమరావతిలో భాజపా టూర్..రాజధాని రణం - bjp_tour_at_amaravathi

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు భాజపా అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆ పార్టీ తరఫున అమరావతి ప్రాంతంలో పర్యటించిన నేతలు... రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

అమరావతిలో భాజపా టూర్..రాజధాని రణం
author img

By

Published : Aug 27, 2019, 10:04 PM IST

అమరావతిలో భాజపా టూర్..రాజధాని రణం

అమరావతిపై రాష్ట్రమంత్రులు చేస్తున్న ప్రకటనలతో ఆందోళనలో ఉన్న రాజధాని ప్రాంత రైతులకు దన్నుగా నిలబడేందుకు భాజపా ఉందని ఆ పార్టీ తెలిపింది. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాతో రాజధాని రైతులు భేటీ అయ్యారు. అమరావతి ప్రాంతంలో పర్యటించాలని వారు చేసిన విజ్ఞప్తి మేరకు కన్నాతో పాటు సుజనాచౌదరి, మరికొందరు ముఖ్య నేతలు ఇవాళ రాజధానిలో పర్యటించారు.

బొత్స ఎప్పుడైనా తిరిగారా?
పర్యటనలో భాగంగా...రాయపూడిలో రైతులతో భాజపా నేతలు సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రాజధాని ప్రాంతం గురించి కనీస అవగాహన లేకుండా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారని రైతులు అభిప్రాయపడ్డారు. అసలీ ప్రాంతంలో బొత్స ఎప్పుడైనా తిరిగారా అని ప్రశ్నించారు. రాజధాని ముంపు నిరూపిస్తే తమ భూమిని రాసిస్తామని ఓ మహిళ సవాల్ విసిరారు. నాలుగైదు రోజులుగా రాజధాని రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి మాట్లాడాలి
రైతుల అభిప్రాయాలు విన్న భాజపా నేతలు... అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. రాజధాని గుంటూరు జిల్లాలో పెట్టాలని నిర్ణయించినపుడు తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వాగతించానని... ఇపుడూ అదే అభిప్రాయంతో ఉన్నానని కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని... ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పందించి అనుమానాలు నివృత్తి చేయాలని కన్నా డిమాండ్ చేశారు.

నాకు భూమి ఉంటే ఆయనకే రాసిస్తా!
సమావేశం తర్వాత భాజాపా నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ప్రధానంగా నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో కలియదిరిగారు. పనులు ఆగిపోయిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రాజధాని ప్రస్తుతం దయ్యాల నగరంలా కనిపిస్తోందని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు చంద్రబాబు హైటెక్ సిటిని ప్రారంభిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి కొనసాగించారని...ఇపుడు జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి బొత్స వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు రాజధాని పరిధిలోని 29గ్రామాల్లో భూములున్నట్లు నిరూపిస్తే ఆయనకే రాసిస్తానని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి:'రాజధాని ప్రాంతంలో ఆస్తులుంటే నిరూపించండి'

Intro:sharBody:sriharikotaConclusion:nn
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.