ETV Bharat / city

జీహెచ్ఎంసీ ఎన్నికలు: నేడు భాజపా అభ్యర్థుల తొలి జాబితా

జీహెచ్ఎంసీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును భాజపా ముమ్మరం చేసింది. అభ్యర్థుల తొలి జాబితాను నేడు ప్రకటించనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించిన రోజే మొదటి జాబితా ప్రకటించాలని తొలుత భాజపా అనుకున్నా మంగళవారం కొలిక్కి రాలేదు. గ్రేటర్‌ పరిధిలో పార్టీ జిల్లా శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి ఆశావహుల జాబితాను వడపోశారు.

BJP candidates for ghmc elections
జీహెచ్ఎంసీ ఎన్నికలు
author img

By

Published : Nov 18, 2020, 11:00 AM IST

జీహెస్​ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో కమలదళం గ్రేటర్‌ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేసింది. బుధవారం తొలి జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. మరోవైపు తెరాస, కాంగ్రెస్‌లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు భాజపా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించిన రోజే మొదటి జాబితా ప్రకటించాలని తొలుత భాజపా అనుకున్నా మంగళవారం కొలిక్కి రాలేదు. గ్రేటర్‌ పరిధిలో పార్టీ జిల్లా శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి ఆశావహుల జాబితాను వడపోశారు. గ్రేటర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్​, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన రాగానే ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి తొలి జాబితాను ఖరారు చేయాలని భాజపా నిర్ణయించింది. మరోవైపు జాతీయ నాయకత్వం గ్రేటర్‌ ఎన్నికల కోసం ప్రకటించిన ఐదుగురు ఇన్‌ఛార్జుల్లో కర్ణాటకకు చెందిన మంత్రి సుధాకర్‌, ఎమ్మెల్యే సతీశ్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

గ్రేటర్‌ పోరుకు సమన్వయకర్తలు..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కమలదళం గ్రేటర్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించింది. 24 అసెంబ్లీ స్థానాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల్ని సమన్వయకర్తలుగా నియమించింది. డివిజన్ల వారీగా కూడా ఇతర నేతలను బాధ్యులుగా నియమించింది. మేనిఫెస్టో కమిటీకి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, ప్రచార కమిటీకి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బహిరంగ సభలకు బంగారు శృతి, ఫైనాన్స్‌ అకౌంట్స్‌ కమిటీకి వివేక్‌ వెంకటస్వామి, ఎన్నికల సంఘం, న్యాయపరమైన అంశాలకు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, మీడియా కమిటీకి ధర్మపురి అర్వింద్‌ను ఇన్‌ఛార్జిగా నియమించింది. ఏపీకి చెందిన ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఇన్‌ఛార్జిగా మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, సహ ఇన్‌ఛార్జులుగా సీఎం రమేశ్‌, డాక్టర్‌ పద్మ, సుమంతిరెడ్డి, సుహాసినిరెడ్డి, డాక్టర్‌ నిర్మలదేవిని నియమించింది.

అసెంబ్లీ స్థానాల వారీగా...

నాంపల్లి- సోయం బాపురావు, శేరిలింగంపల్లి- ధర్మపురి అర్వింద్‌, మల్కాజిగిరి- ఎం.రఘునందన్‌రావు, ఎల్‌బీనగర్‌- సంకినేని వెంకటేశ్వరరావు, మహేశ్వరం-యన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రనగర్‌-వన్నాల శ్రీరాములు, ఉప్పల్‌- ఎం.ధర్మారావు, కుత్బుల్లాపూర్‌- చాడా సురేష్‌రెడ్డి, కూకట్‌పల్లి- పెద్దిరెడ్డి, పటాన్‌చెరు- పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అంబర్‌పేట- రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ముషీరాబాద్‌- జితేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌- విజయరామారావు, కంటోన్మెంట్‌- శశిధర్‌రెడ్డి, సనత్‌నగర్‌- మోత్కుపల్లి నర్సింహులు, జూబ్లీహిల్స్‌- చంద్రశేఖర్‌, ఖైరతాబాద్‌- మృత్యుంజయం, చార్మినార్‌- కాశీపేట లింగయ్య, గోషామహల్‌- యండల లక్ష్మీనారాయణ, కార్వాన్‌-బొడిగ శోభ, మలక్‌పేట- విజయపాల్‌రెడ్డి, యాకుత్‌పుర- రామకృష్ణారెడ్డి, బహదూర్‌పుర-సుద్దాల దేవయ్యలు నియమితులయ్యారు.

ఇవీ చూడండి:

ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ.. ఎన్నికల కమిషనర్​కు.. సీఎస్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.