ETV Bharat / city

జగన్​ అలా ప్రకటిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: సత్యకుమార్​ - జగన్‌కు భాజపా జాతీయకార్యదర్శి సత్యకుమార్‌ సవాల్

Sathya Kumar letter to CM Jagan: సీఎం జగన్‌కు భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ లేఖ రాశారు. మూడు ముక్కలాట తప్ప మూడున్నరేళ్లలో చేసిందేమీ లేదని లేఖలో పేర్కొన్నారు. అమరావతిని ఎన్నడూ సమర్థించలేదని జగన్‌ తాను నమ్మే పవిత్ర గ్రంథం సాక్షిగా ప్రకటిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సత్యకుమార్‌ సవాల్‌ విసిరారు.

Sathya Kumar letter to CM Jagan
సీఎం జగన్‌కు భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ లేఖ
author img

By

Published : Oct 14, 2022, 6:08 PM IST

Updated : Oct 14, 2022, 6:19 PM IST

Sathya Kumar letter to CM Jagan: అమరావతి రైతుల పాదయాత్రపై సీఎం, మంత్రులు చేస్తున్న ప్రకటనల వల్ల ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయని.. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆక్షేపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి సత్యకుమార్‌ లేఖ రాశారు. 3 రాజధానుల పేరిట కృత్రిమంగా ఉద్యమం సృష్టించి అమరావతి రైతుల పాదయాత్రకు అడ్డుపడొద్దని కోరారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను మరింత విభజించే ఆలోచనలు సరికాదన్నారు.

సీఎం అనాలోచిత, అస్తవ్యస్త పరిపాలన వల్ల రాష్ట్ర ప్రజలు కనీసం రాజధాని ఏదో చెప్పుకోలేని అనాథలయ్యారని ఎద్దేవా చేశారు. వెయ్యి రోజులకుపైగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను ఒక్కసారైనా పిలిచి మాట్లాడకపోవడమే సమస్య వట వృక్షంలా పెరగడానికి కారణమన్నారు. అమరావతిని ఎన్నడూ సమర్థించలేదని జగన్‌ తాను నమ్మే పవిత్ర గ్రంథం సాక్షిగా ప్రకటిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సత్యకుమార్‌ సవాల్‌ విసిరారు.

మూడు ముక్కలాట తప్ప మూడున్నరేళ్లలో చేసిందేమీ లేదని సత్యకుమార్​ ధ్వజమెత్తారు. రాజధాని పేరు చెప్పుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులతో మాట్లాడాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తుల దోపిడీయే వైకాపా లక్ష్యమని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో చెప్పాలని సత్యకుమార్‌ డిమాండ్​ చేశారు.

"మూడు ముక్కలాట తప్ప మూడున్నరేళ్లలో చేసిందేమీ లేదు. రాజధాని పేరు చెప్పుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అమరావతి రైతులతో మాట్లాడాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. అమరావతిని ఎన్నడూ సమర్థించలేదని జగన్‌ తాను నమ్మే పవిత్ర గ్రంథం సాక్షిగా ప్రకటిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తుల దోపిడీయే వైకాపా లక్ష్యం. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో చెప్పాలి." -సత్యకుమార్‌

ఇవీ చదవండి:

Last Updated : Oct 14, 2022, 6:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.