కేంద్ర బడ్జెట్‌పై భాజపా ఎంపీ జీవీఎల్ స్పందించారు. రాష్ట్రాల అంశాల ప్రాతిపాదికన బడ్జెట్ చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. దిల్లీలో మాట్లాడిన ఆయన... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించి ముందుకెళ్లాలని సూచించారు. చరిత్రపరంగా ఎంతో పేరున్న అమరావతిలో ఐఐసీహెచ్ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రిని కలుస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని గతంలో చెప్పామని స్పష్ట చేశారు. రాజకీయంగా వాడుకోవడానికి కొందరు ప్రత్యేక హోదా అంశం తెరపైకి తీసుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్, లద్దాక్‌లకు ఇచ్చినట్లే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని అన్నారు. నాడు రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా పలుపార్టీలు స్వాగతించాయని గుర్తు చేశారు. పోలవరానికి నాబార్డు ద్వారా నిధులిస్తుందన్న ఆయన... ఆశించిన స్థాయిలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని వెల్లడించారు. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు యూసీలు రావాలని చెప్పారు.
'ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఎప్పుడో చెప్పాం' - latest updates of central budjet 2020
ఏపీకి ప్రత్యేక హాదా ముగిసిన అధ్యాయమని గతంలోనే చెప్పామని భాజపా ఎంపీ జీవీఎల్ అన్నారు. కొందరు రాజకీయంగా ఆ అంశాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను రాష్ట్రాల అంశాల ప్రాతిపాదికన చూడటం సరికాదన్నారు.