ETV Bharat / city

MP Arvind on trs mlas: తెరాస ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారు : భాజపా - BJP MP Arvind on trs and congress alliance

MP Arvind on trs mlas: తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. తెలంగాణపై భాజపా ఫోకస్​ పెట్టిందని.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఎంపీ అరవింద్
ఎంపీ అరవింద్
author img

By

Published : Dec 12, 2021, 3:36 PM IST

MP Arvind on trs mlas: తెలంగాణపై భాజపా దృష్టిసారించిందని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నిజామాబాద్​లో ఆయన మీడియాతో చిట్​చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేసిన అర్వింద్​.. కాంగ్రెస్, తెరాస మధ్య పొత్తుకు అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎక్కడైనా పోటీ చేస్తా..
భాజపాలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని.. తెరాస ఎమ్మెల్యేలూ తమతో టచ్​లో ఉన్నారని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీలో చేరి పనిచేయని నేతలను సహించేది లేదని అర్వింద్​ స్పష్టం చేశారు. తన ద్వారా పార్టీలోకి వచ్చినంత మాత్రాన టికెట్​ గ్యారంటీ ఏమీ లేదని తేల్చిచెప్పారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి కూడా పోటీచేస్తానని చెప్పిన అర్వింద్​.. ఏ స్థానంలో పోటీకైనా తాను సిద్ధమన్నారు. నిజామాబాద్​ పార్లమెంట్​ పరిధిలో ఏడు స్థానాల్లో గెలవడమే తన లక్ష్యమన్నారు.

డీఎస్​పై ఆసక్తికర వ్యాఖ్యలు..
MP Arvind on kcr: ఈ సందర్భంగా తన తండ్రి.. తెరాస రాజ్యసభ సభ్యుడు డీఎస్​పై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో చేరాలన్నదానిపై డీఎస్ నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. ఈడీ నోటీసుల భయంతోనే కేసీఆర్ దిల్లీకి పరుగులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం విదేశాలకు పరారవ్వడం ఖాయమన్నారు.

ఇదీచూడండి: మరిన్ని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. దేశంలో 36కు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.