భాజపా తలపెట్టిన రామతీర్థం ధర్మయాత్రను అడ్డుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిని, తెదేపా అధినేత చంద్రబాబును అనుమతించి.. భాజపా, జనసేన నేతలను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన నేతలపై దాడి చేసి.. వారిని అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మంది భాజపా, జనసేన నేతలను గృహ నిర్బంధం చేశారని దుయ్యబట్టారు.
'ఏపీ సీఎం జగన్ రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఘటన జరిగి వారంరోజులైంది. ఇప్పటి వరకూ సీఎం జగన్ నిద్రపోతున్నారా? భాజపా, జనసేన నేతలు పోరాటం చేసిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించారు. రామతీర్థం ఘటనపైనే ఎందుకు సీఐడీ విచారణ ఎందుకు ఆదేశించారు? మిగిలిన ఆలాయాలపై జరిగిన దాడుల సంగతేమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల దాడుల అంశంపై విచారణకు ఆదేశించకుంటే.. భాజపా పోరాటం చేస్తుంది.'
- సునీల్ దేవధర్, భాజపా ఏపీ వ్యవహారాల సహ ఇన్ఛార్జి
ఇదీ చదవండి: