ETV Bharat / city

అవినీతిపరులకు జీవితకాల శిక్ష : సుప్రీంకోర్టులో అశ్వినీ కుమార్ పిల్ - భాజపా నేత అశ్వినీ కుమార్ న్యూస్ అప్​డేట్స్

అవినీతి, నల్లధనం, బినామీ, ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్‌, పన్ను ఎగవేతల్లాంటి కేసుల్లో దోషులకు జీవితకాల శిక్షలు విధించాలని కోరుతూ భాజపా నేత, న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. అమెరికా సహా పలు దేశాల్లో తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన 97 మందికి గత రెండు దశాబ్దాల్లో 100 నుంచి వేల సంవత్సరాల జైలు శిక్షలు విధించిన ఉదంతాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ashwini kumar
ashwini kumar
author img

By

Published : Nov 16, 2020, 6:42 AM IST

ప్రస్తుతం భారతదేశంలోని అవినీతి నిరోధక చట్టాలు బలహీనంగా ఉన్నాయని.. వాటి ప్రకారం గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించడం తప్ప అవినీతి ద్వారా సంపాదించిన ఆస్తులను 100% స్వాధీనం చేసుకునే అవకాశం లేదని భాజపా నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ పేర్కొన్నారు. అందువల్ల ప్రపంచంలోనే అత్యుత్తమమైన అవినీతి నిరోధక చట్టాలను రూపొందించేలా న్యాయ కమిషన్‌, లోక్‌పాల్‌లను ఆదేశించాలని సుప్రీంకోర్టును అర్థించారు. నల్లధనం వెలికితీత కోసం కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌గా సేవలందించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌ కూడా మనీలాండరింగ్‌ కేసుల్లో నిందితులకు జైలుశిక్ష పెంచాలని చెప్పినట్లు గుర్తు చేశారు. ‘ప్రస్తుతం భారతదేశంలో రూపాయి నుంచి రూ.300 కోట్ల వరకు మనీలాండరింగ్‌ చేసేవారికి ఒకే రకమైన శిక్ష ఉంది. ఆర్థిక నేరాలూ.. హత్య, హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరాలే అయినా మన దేశంలో వాటిని ఆ కేటగిరీలో చేర్చలేదు’ అని జస్టిస్‌ పసాయత్‌ పేర్కొన్నట్లు ప్రస్తావించారు.

7 లక్షల కోట్ల నల్లధనం

దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అన్నీ కలిపి రూ.70 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నాయని, అందులో 10% (సుమారు రూ.7 లక్షల కోట్లు) నల్లధనంగా మారుతోందని పేర్కొన్నారు. అందువల్ల కేంద్రం రూ.100 కంటే పెద్ద నోట్లను ఉపసంహరించి నగదు లావాదేవీలను గరిష్ఠంగా రూ.5వేలకు పరిమితం చేసేలా చూడాలని కోరారు రూ.50వేలకు మించిన ఆస్తులన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించి బినామీ, ఆదాయానికి మించిన ఆస్తులన్నింటినీ నూరుశాతం స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ప్రయోజనాలివీ..

దేశంలో అవినీతి కనుమరుగైతే.. ‘1. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు 20% అదనపు ఆదాయం వస్తుంది. 2. వినియోగ వస్తువుల ధరలు 20% తగ్గుతాయి. 3. పారదర్శక ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. 4. అయిదు శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు లభిస్తాయి. 5. మౌలిక వసతుల నిర్మాణ వ్యయం 10% తగ్గుతుంది. 6. తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాదం 50% తగ్గిపోతాయి. 7. కులం, మతం, భాష, ప్రాంతీయ వాదాలు 50% కనుమరుగవుతాయి. 8. ఈడబ్ల్యూఎస్‌-బీపీఎల్‌ కుటుంబాలకు 20% అదనంగా సబ్సిడీలు ఇవ్వొచ్చు. 9. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుంది. 10. జీడీపీలో 20% వృద్ధి సాధ్యమవుతుంది. 11. ఉద్యోగాలు భారీగా పెరుగుతాయి. 12. మరింత మంది ప్రజలకు సామాజిక భద్రత కల్పన సాధ్యమవుతుంది. 13. పన్ను ఎగవేతల నుంచి నవ కల్పనల వైపు దృష్టి మరలుతుంది. 14. అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలిచే వ్యాపార వ్యవస్థ ఏర్పడుతుంది. 15. ఉత్తమమైన న్యాయపాలన సాధ్యమవుతుంది. 16. ప్రాథమిక హక్కులకు మరింత భద్రత ఏర్పడుతుంది’ అని అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ నేరాలకు జీవిత ఖైదు..

లంచం, నల్లధనం, బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు, పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్‌, అధిక లాభాలు పొందడం, ఆహార ధాన్యాల అక్రమ నిల్వ, ఆహార కల్తీ, మనుషులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బ్లాక్‌ మార్కెటింగ్‌, మోసం, ఫోర్జరీ, మోసపూరితంగా ఆస్తుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకం, ఖాతాలు రాయడంలో మోసాలు, బినామీ లావాదేవీలు, కార్పొరేట్‌, ఫోరెన్సిక్‌ మోసాలన్నింటికీ జీవితకాల జైలు శిక్ష విధించాలని ఉపాధ్యాయ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. ‘ప్రతి చోటా అవినీతి చొరబడటం వల్లే దేశంలో ఎక్కువగా దీని గురించే చర్చ జరుగుతోంది. అది ప్రపంచవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితంలోని అన్ని కోణాలతోనూ పెనవేసుకు పోయింది’ అని ఆంధ్రప్రదేశ్‌ వర్సెస్‌ వాసుదేవరావు కేసులో 2014లో సుప్రీం ఇచ్చిన తీర్పులోని అంశాన్ని ఆయన ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు.

ఇదీ చదవండి:

తెరుచుకున్న శబరిమల ఆలయం- భక్తులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.