రాష్ట్ర ప్రభుత్వం రౌడీ రాజ్యాన్ని నడుపుతోందని రాష్ట్ర వ్యవహారాల భాజపా ఇన్ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ అన్నారు. ఇసుక, ఎర్రచందనం మాఫియాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. తలనీలాల వ్యవహారంపై తితిదే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ఎంపీలకు ఇప్పుడు తిరుపతి అభివృద్ధి గుర్తుకొచ్చిందా అని ఎద్దేవా చేశారు. జగన్ సేవ వర్సెస్ జనం సేవ ఏది కావాలో ఓటర్లు తేల్చుకోవాలని సునీల్ దేవ్‌ధర్ అన్నారు.
రాష్ట్రంలో అరాచకాలపై భాజపా-జనసేన జైత్రయాత్ర చేస్తుందని సోము వీర్రాజు అన్నారు. తిరుపతి అభివృద్ధిపై చర్చకు పార్టీలు సిద్ధమా అని సోము వీర్రాజు సవాల్ విసిరారు.
'ఎన్నికల్లో పంచే డబ్బు ఏ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వస్తోంది. జనం ఓట్లేస్తేనే కదా.. వైకాపాకు మెజారిటీ వస్తుందో లేదో తేలేది. ప్రజలను భయపెడుతూ 5 లక్షల మెజారిటీ అంటున్నారు' - సోము వీర్రాజు
ఇదీ చదవండి: 'ఈ - వేలం ద్వారానే తలనీలాలను విక్రయిస్తాం..'