ETV Bharat / city

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలన్న పిల్‌పై హైకోర్టు ఆగ్రహం

జీహెచ్​ఎంసీలో వార్డుల రిజర్వేషన్​ రోస్టర్​ విధానం రాజ్యాంగ విరుద్ధమంటూ భాజపా నేత సుభాష్​ చందర్​జీ హైకోర్టును ఆశ్రయించారు. గ్రేటర్​ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ పిల్​ దాఖలుచేశారు. ఈ పిటిషన్​పై మంగళవారం విచారణ జరగనుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలన్న పిల్‌పై హైకోర్టు ఆగ్రహం
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలన్న పిల్‌పై హైకోర్టు ఆగ్రహం
author img

By

Published : Nov 16, 2020, 7:58 PM IST

బీసీ రిజర్వేషన్ల వివాదాన్ని పరిగణనలో తీసుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు 2010, 2012లో ఇచ్చిన తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని దాసోజు శ్రవణ్ కుమార్ తరఫు న్యాయవాది వాదించారు.

శ్రవణ్​పై ధర్మాసనం ఆగ్రహం

రాజకీయంగా వెనకబడిన వర్గాలు, విద్యాపరంగా బీసీలు వేర్వేరని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా వెనకబడిన వర్గాలను గుర్తించే ప్రక్రియ చేపట్టకుండా.. విద్యారంగానికి చెందిన బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తోందన్నారు. అత్యంత వెనకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిథ్యం లభించడం లేదన్నారు. పిల్ దాఖలు చేసిన దాసోజు శ్రవణ్ కుమార్​పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఎన్నికల షెడ్యూలు జారీ అయ్యే చివరి క్షణంలో వ్యాజ్యం దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించింది.

ఇప్పటివరకు ఏం చేశారు

ఎంబీసీలపై ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ఆపే రాజకీయ వ్యూహంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. ఇదే అంశంపై 2015, 2016లో దాఖలైన రెండు పిటిషన్లతో కలిపి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అయితే తుది తీర్పునకు లోబడి ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

స్టేకు నిరాకరణ

నిరాకరించిన ధర్మాసనం ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వమని స్పష్టం చేసింది. భవిష్యత్తు ఎన్నికలకు ఉపయోగపడేలా విచారణ జరుపుతామన్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. గతంలో దాఖలైన పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టులో పిల్

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రక్రియ ఆపాలంటూ హైకోర్టులో పిల్​

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల ప్రక్రియను ఆపాలని కోరుతూ భాజపా నేత, జీహెచ్​ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్​ సుభాష్​ చందర్​జీ హైకోర్టును ఆశ్రయించారు. వార్డుల రిజర్వేషన్​ రోస్టర్​ విధానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ పిటిషన్​ దాఖలు చేశారు.

గతంలో ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు మార్చే విధానం ఉండేదని.. పదేళ్ల పాటు రిజర్వేషన్ కొనసాగేలా ఇటీవల జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని.. దాని వల్ల కొన్నివర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు.

ఎన్నికలకు సంబంధించిన అంశమైనందున ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీచేయాలని.. జస్టిస్ అభిషేక్ రెడ్డి రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ పిటిషన్​పై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇవీచూడండి: 'వారి మాట వినకుంటే... చంపేస్తామని బెదిరిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.