ETV Bharat / city

SOMU: 'చట్టాలకు విరుద్ధంగా ఏపీ రూ.25 వేల కోట్ల అప్పులు'..కేంద్రానికి సోము వీర్రాజు ఫిర్యాదు - కేంద్ర మంత్రులను కలిసిన సోమువీర్రాజు

దిల్లీలో పలువురు కేంద్రమంత్రులను రాష్ట్ర భాజపా నేతలు కలిశారు. ఏపీ ప్రభుత్వ అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు.

సోమువీర్రాజు
సోమువీర్రాజు
author img

By

Published : Aug 3, 2021, 9:20 PM IST

Updated : Aug 3, 2021, 11:14 PM IST

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం అప్పులపై మాట్లాడే హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇవాళ దిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, హరిదీప్‌ పూరీని భాజపా నేతలు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చట్టాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్‌ రూ.25 వేల కోట్లు అప్పు చేసిందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆర్‌బీఐ నిబంధనలు ప్రభుత్వం ఉల్లంఘించిందని కేంద్రానికి తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రం చేరుకుందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు సోము వీర్రాజు వివరించారు.

ఇదీ చదవండి:

CM Jagan: వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్

Last Updated : Aug 3, 2021, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.