ETV Bharat / city

Bill Gates-KTR: బిల్‌గేట్స్​తో తెలంగాణ మంత్రి చర్చాగోష్ఠి... ఎప్పుడంటే...? - బిల్‌గేట్స్‌తో కేటీఆర్ చర్చాగోష్ఠి

Bill Gates - KTR Chat in Bio Asia 2022 : ఈనెల 24 నుంచి జరిగే బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌.. బిల్‌గేట్స్‌తో దృశ్యమాధ్యమంలో చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. ఆయనతో చర్చాగోష్ఠి కోసం తానెంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నానని మంత్రి కేటీఆర్​ తెలిపారు.

KTR with Bill Gates
కేటీఆర్​తో బిల్​గేట్స్​
author img

By

Published : Feb 19, 2022, 11:42 AM IST

Bill Gates - KTR Chat in Bio Asia 2022 : బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ పాల్గొననున్నారు. దృశ్య మాధ్యమంలో ఈనెల 24 నుంచి జరిగే ఈ సదస్సులో ఆయనతో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారితో గత రెండేళ్ల ప్రపంచ అనుభవాలు, ఆరోగ్య పరిరక్షణలో కొత్త పోకడల వంటి అంశాలపై చర్చించనున్నారు. బిల్‌గేట్స్‌ బయో ఆసియా సదస్సులో పాల్గొననుండడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Bill Gates in Bio Asia 2022 : ‘‘ బిల్‌గేట్స్‌తో చర్చాగోష్ఠి కోసం నేను ఉత్కంఠతో ఎదురుచూస్తున్నా. జీవశాస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితిపై గేట్స్‌తో ఆసక్తికరమైన చర్చ నిర్వహిస్తాం. సదస్సులో ప్రభావవంతమైన, దార్శనిక నేతలు పాల్గొంటున్నారు’’ అని వివరించారు. ఈ సదస్సులో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అలెక్స్‌ గోర్క్సీ, మెడ్‌ట్రానిక్‌ సీఈవో జెఫ్‌ మార్తాలు సైతం ప్రసంగించనున్నారని జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్‌ తెలిపారు.

Bio Asia 2022 :అమెరికాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం హార్వర్డ్‌ ఆదివారం నిర్వహించే ‘హార్వర్డ్‌ భారత్‌’ దృశ్య మాధ్యమ సదస్సులో మంత్రి కేటీ రామారావు ప్రసంగించనున్నారు. ఈ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ‘2030 భారత పురోగమన దశకం’ అనే అంశంపై మంత్రి మాట్లాడనున్నారు. తెలంగాణలో ఐటీ ఆధారిత వృద్ధి, మహిళా-కేంద్రీకృత వ్యాపార ఇంక్యుబేటర్లు తదితర అంశాలపై ఆయన తన ఆలోచనలను పంచుకుంటారు.

  • ఇదీ చదవండి :

Save Life: రైలు ఎక్కుతూ జారిపడ్డ ప్రయాణికుడు... కాపాడిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.