ప్రకాశం జిల్లా చీరాలలో బీమ్లా నాయక్ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద పవన్ పవన్ కల్యాణ్ అభిమానుల సందడి చేస్తున్నారు. థియేటర్ల ప్రాంగణమంతా పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలతో నింపేశారు. ఓ అభిమాని చేతిలో కర్పూరం వెలిగించుకుని జై పవన్ అంటూ నినాదాలు చేశాడు.
అర్థరాత్రి నుంచే సందడి..
అర్దరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ జిందాబాద్.. కాబోయే సీఎం అంటూ అరుపులు కేకలతో హోరైతించారు. ప్రభుత్వం జనసేనాని పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఫిరంగిపురంలో థియేటర్‌పై రాళ్లు..
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. భీమ్లానాయక్ బెనిఫిట్ షో ఉందంటూ ఈశ్వరసాయి థియేటర్లో ముందుగా టిక్కెట్లు విక్రయించారు. సినిమా ప్రదర్శించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. ఒకో టిక్కెట్ రూ.300 నుంచి 500 వందలు దాకా తీసుకున్నట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటలకు షో ఉంటుందని.. ఆ ఆటకు టికెట్లు ఉపయోగించుకోవాలని థియేటర్ యాజమాన్యం సూచించింది. కోపంతో థియేటర్‌పై రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దు మణిగింది.
భీమ్లా నాయక్ చూసేందుకు.. గుంటూరులో అభిమానులు థియేటర్లు వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. థియేటర్ వద్ద పవన్ కల్యాణ్ చిత్ర పటానికి కొబ్బరికాయలు కొట్టి, హారతులు ఇచ్చారు. బాణసంచా పేల్చి అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు సైతం సినిమా చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫిరంగి పురంలోని ఈశ్వరసాయి థియేటర్లో ఉదయం 10.30కు మొదటి షో ప్రారంభమైంది.
సినిమా కోసం యానాంకు..
రాష్ట్రంలో బెనిఫిట్ షోకు అనుమతి లేకపోవడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పవన్ అభిమానులు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చారు. యానాంలోని రెండు థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శన వేయడంతో ప్రధాన రహదారి అంతా జనంతో కిటకిటలాడింది. వెండితెరపై పవన్ కల్యాణ్ కనిపించగానే అభిమానుల కేరింతలు కొట్టారు.
టికెట్లు ఇవ్వాలని ఆందోళన..
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని సత్యనారాయణ కళామందిర్ వద్ద టికెట్లు ఇవ్వాలంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. సినిమా వేయడం లేదని యాజమాన్యం చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వాగ్వాదానికి దిగారు. దీంతో సినిమా ధియేటర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను వెనక్కి పంపించి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
తీన్మార్ డప్పులతో ఉత్సాహంగా..
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, కొత్తపేటలో అభిమానులు సందడి చేశారు. సినిమా థియేటర్ వద్ద తీన్మార్ డబ్బులతో జనసేన జెండాలు పట్టుకుని ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు. ప్రధాన సెంటర్లలో అభిమానులు ర్యాలీ నిర్వహించారు.
సినిమా ఆగిపోయిందని టపాసులు పేల్చారు..
అసలే బెనిఫిట్ షో లేక విసిగిపోయిన పవన్ కల్యాణ్ అభిమానులకు సినిమా మధ్యలో ఆగిపోవడంతో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఏకంగా సినిమా థియేటర్ లోపల స్క్రీన్ ముందే టపాసులు పేల్చి ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురంలో భీమానాయక్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో సాంకేతిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోవడంతో దియేటర్ లోపల స్క్రీన్ ముందే టపాసులు పేల్చారు. అయితే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో థియేటర్ యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి: