ETV Bharat / city

రోటవాక్‌ని ఇమ్యూనైజేషన్‌లో నైజీరియా భాగం చేసిందన్న భారత్‌ బయోటెక్‌ - Rotavac Oral Vaccine

Rotavac Vaccine రోటవాక్‌ని ఇమ్యూనైజేషన్‌లో నైజీరియా భాగం చేసిందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. నైజీరియాలో ఏటా 50 వేల మంది చిన్నారులు రోటావైరస్‌తో మృతి చెందుతున్నారని తెలిపింది. భారత్‌లో తయారైన వ్యాక్సిన్లు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయని పేర్కొంది.

bharat biotech
bharat biotech
author img

By

Published : Aug 24, 2022, 8:49 PM IST

Rotavac Vaccine: భారత్ బయోటెక్ తయారు చేసిన రోటావాక్ వ్యాక్సిన్‌ని నైజీరియా ప్రభుత్వం ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంచేసినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా రోటా వైరస్‌తో చనిపోతున్న చిన్నారుల్లో 14 శాతం మంది నైజీరియాకు చెందిన వారే ఉన్నారు. ఏటా నైజీరియాలో సుమారు 50వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు రోటావైరస్‌తో చనిపోతున్నట్లు పేర్కొన్న భారత్ బయోటెక్... ఆ దేశ ప్రభుత్వం రోటావాక్‌ని చిన్నారులకు అందించేందుకు నిర్ణయించిందని వివరించింది.

భారత్‌లో తయారైన వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు కాపాడుతుండటం గర్వకారణమని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ తెలిపారు. రోటావాక్‌ని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యఆసియా దేశాల్లో వినియోగిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.